దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనాలతో రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్(Toll Plaza) బాదుడు మొదలైంది. వాహనం స్థాయిని బట్టి 10 నుంచి 90 రూపాయల వరకు పెంచారు. పెరిగిన ఛార్జీలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. వీరి ఇబ్బందులు తొలగించేందుకు గూగుల్ మ్యాప్స్(Google Maps) సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా సార్లు టోల్ గేట్లు అడ్డు వస్తాయి. ప్రతి చోటా డబ్బు కట్టనిదే ఎంట్రీ ఉండదు. ప్రయాణ ఖర్చలకు ఇది అదనపు భారంగా మారుతుంది. అయితే టోల్‌ప్లాజా లేని ప్రత్యామ్నాయ మార్గాల గురించి గూగుల్‌మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్(New feature) ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త అప్డేట్లో టోల్ ఫీజు చెల్లించాల్సిన రూట్లు, ఎన్నిసార్లు ఎంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది వంటి వివరాలను వినియోగదారులకు ముందుగానే తెలియజేస్తుంది. వారు చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఈ వివరాలను చూపిస్తుంది. అంతే కాదు ఏఏ టోల్ ప్లాజ్ వద్ద ఏ రోజు ఎంత ఫీజు చెల్లించాలి? పేమెంట్ చెల్లించేందుకు యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సదుపాయం ఉందా? వంటి వివరాలను కూడా ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో చూడవచ్చు.
భారత్‌లోని 2000 రోడ్డు మార్గాలు సహా అమెరికా, జపాన్, ఇండోనేషియాలో టోల్ ఫీజుల వివరాలను కొత్త అప్డేట్లో చేర్చుతున్నట్లు గూగుల్ తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకవేళ యూజర్లు టోల్ ఫీజు చెల్లించొద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మ్యాప్స్‌లో చూపించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ నెల నుంచే టోల్ రుసుంకు సంబంధించిన వివరాలు ఆందుబాటులో ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్‌లో టాప్ రైట్ కార్నర్లో ఉన్న మూడు డాట్ల ట్యాప్ చేస్తే.. టోల్ ఫీజు లేని మార్గాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కూడా యూజర్లకు ఉంటుంది.
Also Read
Raashii Khanna: ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రాశిఖన్నా..
Suchitra Sen : చిత్ర సీమకు ఆరాధ్య నటి సుచిత్రాసేన్ … క్లాసిక్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ మహానటి