Ration: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ప్రతీఒక్కరికీ బెనిఫిట్..

రేషన్ కార్డుదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వేసవి దృష్ట్యా మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అంతర్జాతీయ ఉద్రిక్తతల క్రమంలో దేశంలో రేషన్‌కు కొరత ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది.

Ration: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ప్రతీఒక్కరికీ బెనిఫిట్..
Ration Card

Updated on: Apr 09, 2026 | 1:42 PM

రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దం, అమెరికా జోక్యం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే సరుకు రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి ఆహార పదార్ధాల దిగుమతి నిలిచిపోవడం వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆహార కొరత లేదని, రేషన్ సరుకుల పంపిణీకి కూడా కొరత లేదని స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఉన్నవారు బియ్యం, పప్పులు, గోధుమలు, పంచదార, నూనె వంటివి పొందేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్రం కీలక నిర్ణయాలు

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నిత్యావసర సరుకుల కొరత ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సరుకుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ ప్రజల అవసరాలకు అనుగుణండా ఆహార ధాన్యాల నిల్వ ఉందని, అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నా ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహంతో ముందుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. దేశంలో ఆహార భద్రతకు నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం దేశంలో గోధుములు, బియ్యం తగినంత అందుబాటులో ఉన్నాయని, రేషన్ కార్డుదారులకు వీటిని అందించేందుకు ఎలాంటి కొరత లేదని పేర్కొంది.

నిరంతరం అందుబాటులో..

రేషన్ సరుకులు నిరంతరం అందుబాటులో ఉంటాయని, వాటికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. పప్పులు, వంట నూనెలు, గోధుమలు, పంచదార వంటి వస్తువులు కొరత లేదని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 28 లక్షల టన్నుల నిల్వలు సిద్దంగా ఉన్నాయి. ఇక పప్పు ధాన్యాలు, వేరుశనగపై దిగుమతి సుంకాన్ని సవరించడం ద్వారా ఎలాంటి సమస్య ఉండటం లేదు. ఇక దేశంలో అవసరాలకు మంచి షుగర్ నిల్వలు ఉన్నాయి. గత 3 ఏళ్లుగా వీటి ధరలు 3 శాతం వద్ద స్ధిరంగా ఉన్నాయి. తక్కువ ధరకే వినియోగదారులకు చక్కెర్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక దేశంలో వంటనూనెల నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతున్నాయి. దేశంలో నూనెల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. అవసరమైతే మార్కెట్లలో జోక్యం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్దంగా ఉంది. అటు గోధుమల సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

Follow Us