మొఘలుల కాలం నాటి లంకె బిందెలు దొరికాయ్.. యజమానికి తెలియకుండా కూలీలు ఏం చేశారంటే..

|

Dec 12, 2020 | 10:19 AM

ఇవాళా రేపు రోడ్డుపై పది రూపాయాలు దొరికాయంటే చాలు వెంటనే దాచేస్తారు.. అలాంటిది బంగారు నాణేలు దొరికితే ఊరుకుంటారా..

మొఘలుల కాలం నాటి లంకె బిందెలు దొరికాయ్.. యజమానికి తెలియకుండా కూలీలు ఏం చేశారంటే..
Follow us on

ఇవాళా రేపు రోడ్డుపై పది రూపాయాలు దొరికాయంటే చాలు వెంటనే దాచేస్తారు.. అలాంటిది బంగారు నాణేలు దొరికితే ఊరుకుంటారా.. వెంటనే పంచేసుకుంటారు. సరిగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పొలంలో తవ్వకాలు జరుపుతుండగా మొఘలుల కాలం నాటి లంకెబిందెలు బయటపడ్డాయి. దీంతో యజమాని, కూలీలు అందులోని బంగారు నాణేలను పంచకొని ఉడాయించారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సురార్ గ్రామానికి చెందిన బ్రజ్ కిషోర్ పాండేయ్‌కు గ్రామం బయట పొలం ఉంది. ఆ పొలంలో మొక్కలు నాటించేందుకు కొంతమంది కూలీలతో అతను భూమి పనులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వారికి ఒక మొఘలుల కాలం నాటి మట్టి పాత్ర ఒకటి లభ్యమైంది. వెంటనే దానిని తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు దర్శనమిచ్చాయి. దీంతో యజమాని బ్రజ్ కిశోర్‌, కూలీలు కలిసి వాటిని లెక్కప్రకారం పంచుకొని ఊరు వదిలి పారిపోయారు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా విని పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు వారిని వెతికిపట్టుకొని వారి దగ్గరి నుంచి 35 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.