Liquor Bottle: మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లిన ఫ్రెండ్.. అక్కసుతో హత్య చేసిన స్నేహితుడు

|

Jul 04, 2024 | 7:18 PM

ఓ వ్యక్తి తన స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్‌గా మందు పార్టీ ఇచ్చాడు. ఈ తర్వాత పార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ను అతని ఫ్రెండ్స్‌లో ఓ వ్యక్తి తనతోపాటు తీసుకెళ్లాడు. దీనిపై ఆగ్రహించిన మరో స్నేహితుడు అదను చూసి అతడిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గోవాలో వారం క్రితం చోటు చేసుకోగా బుధవారం (జులై 3) వెలుగులోకి..

Liquor Bottle: మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లిన ఫ్రెండ్.. అక్కసుతో హత్య చేసిన స్నేహితుడు
Friend Kills Man For Liquor
Follow us on

పనాజీ, జులై 4: ఓ వ్యక్తి తన స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్‌గా మందు పార్టీ ఇచ్చాడు. ఈ తర్వాత పార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ను అతని ఫ్రెండ్స్‌లో ఓ వ్యక్తి తనతోపాటు తీసుకెళ్లాడు. దీనిపై ఆగ్రహించిన మరో స్నేహితుడు అదను చూసి అతడిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గోవాలో వారం క్రితం చోటు చేసుకోగా బుధవారం (జులై 3) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

దక్షిణ గోవాలోని కోర్టాలిమ్ గ్రామంలో మంగళవారం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ స్థలంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని లియోనెల్ లోబో (32)గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా.. అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం జరిగిన ఓ మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్‌లను లియోనెల్ లోబో తనతోపాటు తీసుకెళ్లాడట. దీంతో ఆగ్రహించిన తోటి స్నేహితుడు కౌటిన్హో.. లియోనెల్ లోబో (32) నిర్మాణంలో ఉన్న స్థలంలో నిద్రిస్తున్న సమయంలో హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో నిందితుడు కౌటిన్హోని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం నిందితుడ్ని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఫ్రెండ్‌ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గత వారం జరిగిన మందు పార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ను స్నేహితుడు తీసుకెళ్లడంతో ఆగ్రహానికి గురైనట్లు కౌటిన్హో పోలీసులకు తెలిపాడు. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న లోబో తలపై సిమెంట్‌ దిమ్మతో కొట్టి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. అంతేకాకుండా నిందితుడు అలెక్స్ దుస్తులపై మృతుడి రక్తం మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిర్ధారనైంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) సునీతా సావంత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.