
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-WTO రిలీజ్ చేసిన ఓ డేటా ప్రపంచాన్ని వణికిస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గోధుమల సరఫరాకు ఆటకం కలిగితే.. ఈ గల్ఫ్ యుద్ధం కారణంగా ఎరువుల కొరత వల్ల అసలు పంటలే పండని పరిస్థితి రాబోతోందని చెప్పింది WTO. హర్మూజ్ జలసంధి నుంచి గ్యాస్ రాకపోవడంతో ఎక్కడికక్కడ ఎరువుల ప్లాంట్లు మూతపడుతున్నాయ్. ఎరువుల సరఫరా తగ్గడంతో.. జస్ట్ రెండు వారాల్లోనే 40 శాతం పైగా పెరిగాయి. ఒకవేళ ఎరువులు అందని పరిస్థితే ఉంటే.. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల దిగుబడి 30 శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉంది. ఏ ఒక్క దేశం గురించో చెప్పలేదీ విషయాలు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండబోతోందంటూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చేసిన హెచ్చరికలు. యుద్ధం ప్రభావం భారత్‌లో కనిపిస్తోందా లేదా? తెలియాలంటే దగ్గర్లోని పెట్రోల్ బంక్‌కు వెళ్తే తెలుస్తుంది. బంక్‌కు అటు అర కిలోమీటర్, ఇటు అర కిలోమీటర్ ఫుల్ ట్రాఫిక్ జామ్. పైగా.. పెట్రోల్ పంపుల దగ్గర పోలీసుల పహారాలు. ట్రాఫిక్ క్లియరెన్సులు. సడెన్‌గా డ్రంకెన్ డ్రైవ్ గానీ పెడుతున్నారా పోలీసులు అనే డౌట్ వస్తుంది ఆ హడావుడి చూస్తే. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి. ఒక్క...