Girl following ‘Spiritual Coaches’: ఆత్మలతో మాట్లాడేందుకు ఇల్లు విడిచి వాటిని అన్వేషిస్తూ వెళ్లింది. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అనుష్క. షామనిజంతో ప్రభావితమై అనుష్క ఇంటినుంచి వెళ్లినట్లు తల్లిదండ్రులు భావిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది.
బెంగళూరు మహానగరానికి చెందిన 17 ఏళ్ల బాలిక అనుష్క అనే గత రెండు నెలలుగా తన ఇంట్లో కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం వెనుక ‘షామానిజం’ ప్రభావితమై ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అచూకీ గుర్తించేందుకు తల్లిదండ్రులు ఇప్పుడు ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల సహాయం తీసుకున్నారు. మైనర్ బాలిక అనుష్క అక్టోబర్ 31న ఇంటి నుంచి వెళ్లిపోయాయిందని ఆమె తండ్రి అభిషేక్ తెలిపారు. ఆమెను ఎవరో ప్రభావితం చేశారని చెప్పారు. ఆమె ఇల్లు వదిలి ఒంటరిగా ఎక్కడికీ వెళ్లదు. తమ కూతురిని వెతకడానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.
⚠️ MISSING GIRL! ⚠️ Please share max! 17 year old Anushka has been missing from home, originally from Bangalore, and her loved ones are trying to locate her. Please RT and contact the number given if you have any information. Thank you for your help ?? pic.twitter.com/iwYWByr7E7
— Kamya | Think For Yourself ? (@iamkamyabuch) December 24, 2021
అలాగే, అనుష్క తల్లి అర్చన కూడా ఆమె గత కొంతకాలంగా ‘షామానిజం’ వల్ల ప్రభావితమైందని చెప్పింది. నిజానికి, ఇది ఒక పురాతన సంప్రదాయం, దీని ద్వారా ప్రజలు దేవుళ్లు, రాక్షసులు, పూర్వీకుల ఆత్మల కనిపించని ప్రపంచాన్ని విశ్వసిస్తారు. అర్చన మాట్లాడుతూ, ‘తాను షామానిజం టైప్ మెడిటేషన్ చేయాలనుకుంటున్నట్లు మాకు చెప్పింది. ఇంట్లో షామానిజం నేర్చుకోమని అడిగాము. నేను ఆమెను తిరిగి రావాలని అభ్యర్థిస్తున్నాను. అంటూ పేర్కోన్నారు. కూతురి ఆచూకీ కోసం పోలీసులు కూడా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మైనర్ బాలిక తండ్రి అభిషేక్ తెలిపారు. ఇప్పుడు వారు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇంటర్నెట్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. ‘రెండు నెలలైంది. పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నా ఇప్పటి వరకు ఫలితం లేకపోయింది. నేను దీన్ని నా వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నాను మరియు ఇంటర్నెట్ మీడియా ఖాతాల ద్వారా వీలైనంత ఎక్కువ మందిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటూ ఆమె తండ్రి ట్వీట్ చేశారు.
అదే సమయంలో, ఈ మొత్తం వ్యవహారంలో, కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు (ఉత్తర) డిసిపి వినాయక్ పాటిల్ మాట్లాడుతూ, “మేము ఆమె ఫోన్ కదలికలతో సహా అన్ని కోణాలను పర్యవేక్షిస్తున్నాము. సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నాము. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.