Gaganyaan Mission: ఈ ఏడాది గగన్‌యాన్ లేనట్టే.. భారీ ప్రయోగం వాయిదా.. ఇస్రో అదిరిపోయే ప్లాన్ ఇదే..

భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచదేశాలు ఎంతగానో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ప్రయోగాన్ని ఇస్రో వాయిదా వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ప్రతిష్టాత్మంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో చేపట్టాల్సిన గగన్‌యాన్ G1 ప్రయోగంను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు.

Gaganyaan Mission: ఈ ఏడాది గగన్‌యాన్ లేనట్టే.. భారీ ప్రయోగం వాయిదా.. ఇస్రో అదిరిపోయే ప్లాన్ ఇదే..
Gaganyaan Mission

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 06, 2025 | 9:53 AM

భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచదేశాలు ఎంతగానో ఎదురుచూస్తున్న చారిత్రాత్మక ప్రయోగాన్ని ఇస్రో వాయిదా వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో ప్రతిష్టాత్మంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో చేపట్టాల్సిన గగన్‌యాన్ G1 ప్రయోగంను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ ఒక మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే, ఈ గగన్‌యాన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి గగన్ యాన్ జి 1, గగన్ యాన్ జీ2 రాకెట్ ప్రయోగాలను ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరంలో జరపాలని ఇస్రో భావించినా.. అనివార్య కారణాలతో ఈ ప్రయోగం ను 2026 సంవత్సరానికి వాయిదా వేయడం జరిగిందని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని ప్రయోగాత్మక ప్రయోగాలు పూర్తిచేసి 2027లో గగన్ యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి మానవాళిని పంపాలని ఇస్రో ముఖ్య ఉద్దేశం.. అదేవిధంగా ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఇద్దరు లేక ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

2027 నాటికి గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్టును పూర్తి చేసి 400 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న స్పేస్‌లోకి వ్యోమగాములను పంపాలని శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు 8000 వేల టెస్టులు పూర్తి చేసినట్లు ఇస్రో చైర్మన్ చెప్పారు. ఏది ఏమైనా 2027 వ సంవత్సరంలో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం పూర్తి చేసి స్పేస్ లోకి వ్యోమగాములను పంపి స్పేస్ లో 2028 కల్లా ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ భారతదేశానికి చెందిన ఒక స్పేస్ స్టేషన్‌ను నూతనంగా ఏర్పాటు చేయాలని ఇస్రో నిర్ణయించిందన్నారు.

అందులో భాగంగా ఇస్రో 2035 కల్లా స్పేస్ లోకి మరో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిని పంపి.. ప్రపంచ దేశాలకు చెందిన అమెరికా, రష్యా, చైనా వాటికి ధీటుగా భారత్ నిలవాలని ఇస్రో ప్లాన్ చేస్తుందని.. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..