ఐదు రాష్ట్రాల్లో హామీల హోళీ! లక్షల కోట్లతో ఖజానా ఖాళీ!

తమిళనాడు నుంచి అసోం వరకు.. కేరళం నుంచి బెంగాల్ వరకు.. ఐదు రాష్ట్రాల్లో ఒక వింత ధోరణి ప్రబలుతోంది! దాని పేరు.. 'ఉచితం'! అక్షరం నేర్పే విద్య.. ప్రాణం పోసే వైద్యం.. ఆకలి తీర్చే పౌష్టికాహారం.. ఇదీ ప్రజల భవిష్యత్తు కోసం చేసే నిజమైన సంక్షేమం! కానీ.. ఓటు కోసం కురిపిస్తున్న ఫ్రిజ్‌లు, ఎన్నికల వేళ పంచుతున్న ల్యాప్‌టాప్‌లు, ఖాతాల్లో వేస్తున్న వేల రూపాయల నగదు.. ఇది కాదు కదా సంక్షేమానికి అర్థం. ఒక పేదవాడికి సైకిల్ కొనివ్వడం 'ఉచితం' అనుకుంటే.. అదే సైకిల్‌పై తను కూరగాయలు అమ్ముకుని బతకేలా చేయడం 'సంక్షేమం'. ఒకరికి చేపను వండి పెట్టడం 'ఉచితం'.. అదే అతనికి చేపలు పట్టడం నేర్పించడం 'సంక్షేమం'. ఈ డిఫరెన్స్ ఎందుకు మరిచిపోతున్నాయి పార్టీలు? 'శ్రీలంక దివాళా తీసినట్టు'.. అనే మాట వాడుతుంటారు ఉచితాలు విన్నప్పుడల్లా? ఎందుకో తెలుసా. ఎన్నికల్లో గెలవడం కోసం పన్నులు భారీగా తగ్గించి, మితిమీరిన రాయితీలు ఇచ్చారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. కానీ ఉచితాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చలేక, విదేశీ కరెన్సీ లేక.. చివరికి పెట్రోల్, పాలు, మందులు, కనీసం పేపర్ కొనడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి వచ్చింది. ఆనాడు శ్రీలంకలో ఆహార ద్రవ్యోల్బణం 90 శాతం దాటిపోయింది. అప్పుడు వినిపించిన బ్రేకింగ్.. 'శ్రీలంక దివాళా'. రాష్ట్రాలను ఆ స్థితికి తీసుకెళ్దామనుకుంటున్నాయా ఈ పార్టీలు? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏయే పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది? దాని వల్ల రాష్ట్రాల ఖజానాపై పడుతున్న భారం ఎంత? ఉచిత హామీలే నిజంగా పార్టీలను గెలిపిస్తున్నాయా?

ఐదు రాష్ట్రాల్లో హామీల హోళీ! లక్షల కోట్లతో ఖజానా ఖాళీ!
Election Freebies India

Updated on: Mar 30, 2026 | 10:00 PM

తమిళనాడు.. సుమారు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. అయినా సరే, ఆ రాష్ట్రంలో హామీల హోళీని చల్లుకోవడం ఆపడం లేదు. అన్నాడీఎంకే ‘ఉచిత ఫ్రిజ్’ అంటే.. డీఎంకే దానికి పోటీగా 8వేల రూపాయల కూపన్లు తీసుకోండి, ఇంటికి కావాల్సిన టీవీనో, ఫ్రిడ్జో మీరే కొనుక్కోండి అంటోంది. ఇక విజయ్ ఏకంగా బంగారంతోనే హామీల వేలం పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఏది సంక్షేమం, ఏది ఉచితం అనే దానికి ఇప్పటికీ ఓ డెఫినేషన్ లేదు. ఉచిత పథకాలు అనేవి స్వభావంలో చెడ్డవేం కావు. కాని, వాటిని ఎందుకు, ఎలా ఉపయోగిస్తున్నారు, దేనికి ఉపయోగపడుతున్నాయన్నదే ముఖ్యం. నిజానికి సంక్షేమ పథకాలు అనేవి ఒక ‘పెట్టుబడి’ లాంటివి. వీటివల్ల సొసైటీకి కచ్చితంగా లాభం జరుగుతుంది. వ్యక్తులు లేదా కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి ఒక పునాది వేస్తుంది. సపోజ్.. ఎడ్యుకేషన్ సెక్టార్‌ని తీసుకుందాం. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం.. ఇవి ఒక బిడ్డను ప్రయోజకుడిని చేసి, భవిష్యత్తులో టాక్స్ కట్టే పౌరుడిగా మారుస్తాయి. ఇది ఖర్చు కాదు, దేశ భవిష్యత్తుపై పెట్టుబడి. ఇక వైద్యం. ఉచిత చికిత్స, ఆరోగ్య బీమా, వ్యాక్సినేషన్..ఇవి పేద కుటుంబం అనారోగ్యం పాలై అప్పులపాలు కాకుండా కాపాడతాయి. ఆరోగ్యవంతమైన సమాజం...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి