Karnataka: మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై బస్సుల్లో ప్రయాణం ఉచితం

|

Jun 11, 2023 | 2:39 PM

కర్నాటక కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు హామీలలో మొదటి హామీ శక్తి హామీ పథకాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

Karnataka: మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై బస్సుల్లో ప్రయాణం ఉచితం
Karnataka Women Passengers
Follow us on

కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తోంది కాంగ్రెస్‌. మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం ‘శక్తి యోజన’ ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇందుకు కొన్ని కండిషన్లను కూడా పెట్టింది.

రాజహంస, వజ్ర, వాయువజ్ర, ఐరావత, అంబారీ, అంబారీ ఉత్సవ్, ఎఫ్టీ బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది. ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, హిజ్రాలుకు ఈ పథకం కూడా వర్తిస్తుంది. మూడు నెలల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ పూర్తవుతుందని కర్ణాటక ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.స్మార్ట్‌కార్డులు అందని వారు కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది.

అలాగే కర్ణాటక పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుందని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే కర్ణాటక బస్సుల్లో కానీ, కర్ణాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సుల్లో కానీ ఈ పథకం పనిచేయదని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం