రాజ్యసభకు మన్మోహన్ సింగ్ నామినేషన్ దాఖలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన రాజ్యసభ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన సభ్యుడు మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఈ నెల 26న […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:43 pm, Tue, 13 August 19
రాజ్యసభకు మన్మోహన్ సింగ్ నామినేషన్ దాఖలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన రాజ్యసభ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన సభ్యుడు మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

కాగా 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 100మంది సభ్యుల బలం ఉంది. అలాగే 12మంది స్వతంత్ర్య సభ్యుల కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటంతో మన్మోహన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.