అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అక్రమార్కులు మాత్రం రోజుకో పంథాలో సవాల్ చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారు విలువైన వస్తువులను, బంగారం, డ్రగ్స్, గంజాయ్ లాంటివి తీసుకుని వస్తూ దేశంలోని పలు విమానాశ్రయాల్లో పట్టుబడుతూనే ఉన్నారు. స్మగ్లర్లు ఎన్ని ఎత్తులు వేసినా సరే.. కస్టమ్స్ అధికారులు మాత్రం వారికి దిమ్మతిరిగేలా షాక్ ఇస్తున్నారు. తాజాగా.. డిల్లీ విమానాశ్రయంలో కోట్లాది రూపాయల విలువ చేసే బంగారం పట్టుబడింది.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయంలో రూ. 3.16 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని.. దుబాయ్‌కు చెందిన ప్యాసింజర్లను అరెస్టు చేశారు. ఇద్దరూ ఉజ్బెకిస్థాన్ జాతీయులు.. ఒకరు దుబాయ్, మరొకరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఢిల్లీకి వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మే 6, సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) కు చేరుకోగా.. అధికారులు అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ప్రయాణీకులను అరెస్టు చేసి.. 5000 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఢిల్లీ కస్టమ్స్ తెలిపింది. 1962 కస్టమ్స్ చట్టం కింద నిందితులని అరెస్టు చేసిన అనంతరం అధికారులు వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
On the basis of profiling, Customs@IGI Airport have seized 5000 grams of gold valued at Rs. 3.16 Crore from two Uzbekistan nationals who arrived from Dubai. The passengers have been arrested under Customs Act, 1962. Further investigation is underway. pic.twitter.com/SVEk3ByNRv
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) May 6, 2024
ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల బ్యాగు నుంచి ఐదు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ కస్టమ్స్ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని విమనాశ్రయాల్లో బంగారం-స్మగ్లింగ్ సంఘటనలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..