Ayodhya Ram Mandir: సాకారమైన ఐదు శతాబ్దాల కల.. జగదభిరాముడి తొలి దర్శనం ఇదే..

|

Jan 22, 2024 | 1:07 PM

అయోధ్యలో ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమయ్యింది. అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట కన్నుల పండవగా జరిగింది. ప్రధాని మోదీ,ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ , యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు.

Ayodhya Ram Mandir: సాకారమైన ఐదు శతాబ్దాల కల.. జగదభిరాముడి తొలి దర్శనం ఇదే..
Ayodhya Ram Mandir
Follow us on

అయోధ్యలో ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమయ్యింది. అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. బాలరాముడి ప్రాణప్రతిష్ట కన్నుల పండవగా జరిగింది. ప్రధాని మోదీ,ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ , యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు.

బాలరాముడికి కు పట్టు వస్త్రాలు , పీతాంబరం, పాదుకలు, ఛత్రం సమర్పించారు మోదీ. బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. వైదిక మంత్రాల మధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రపంచమంతా రామనామస్మరణ జరుగుతుండగా ఈ కార్యక్రమం జరిగింది.

వీడియో చూడండి..

అయోధ్య దివ్య రామాలయంపై ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. స్వర్ణాభరణాలతో బాలరాముడు మెరిసిపోతున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..