దేశ వాణిజ్య న‌గరం అత‌లాకుత‌లం.. ఓ వైపు క‌రోనా..మ‌రోవైపు విప‌త్తులు

భార‌త్‌లో ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని ప్రాంతాల‌ను వ‌ణికిస్తోంది. మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌ కోవిడ్ ధాటికి చిగురుటాకుల వ‌ణికిపోతోంది. ఇదిలా ఉంటే, దేశ వాణిజ్య నగరాన్నివ‌రుస‌ విపత్తులూ వెంటాడుతున్నాయి.

దేశ వాణిజ్య న‌గరం అత‌లాకుత‌లం.. ఓ వైపు క‌రోనా..మ‌రోవైపు విప‌త్తులు

Edited By:

Updated on: Jun 11, 2020 | 8:35 PM

భార‌త్‌లో ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని ప్రాంతాల‌ను వ‌ణికిస్తోంది. మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌ కోవిడ్ ధాటికి చిగురుటాకుల వ‌ణికిపోతోంది. ఇదిలా ఉంటే, దేశ వాణిజ్య నగరం ముంబైని విపత్తులూ వెంటాడుతున్నాయి.

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న ముంబై నగరానికి ఇటీవల నిసర్గ రూపంలో తుఫాన్ ముప్పు వచ్చినా.. పెద్దగా ప్రభావం చూపకపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే నాలుగు రోజుల కిందట నగరంలోని పలు ప్రాంతాలను కమ్మేసిన దుర్వాసన ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ వాసనకు కారణాలేంటో ఇప్పటికీ తెలియ‌రాలేదు. నగరంలోని అతిపెద్ద మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది.

ముంబ‌యి న‌గ‌రంలో పండ్లు, కూరగాయాల షాపులకు ప్రసిద్ధి చెందిన క్రాఫర్డ్ మార్కెట్‌లో గురువారం (జూన్ 11) రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక‌ చర్యలు చేపట్టారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రసిద్ధ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈ మార్కెట్ ఉండటంతో ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదానికి గ‌ల కార‌ణ‌ల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు.