ధరలు పెరిగాయా? అయితే తినడం మానేయండి.. నిర్మలమ్మ సూపర్ సజీషన్

ధరలు పెరిగాయా? అయితే తినడం మానేయండి.. నిర్మలమ్మ సూపర్ సజీషన్

ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతుంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా కూల్ తినడం మానేయమంటున్నారు. ఇదెక్కడో అన్న మాట కాదు.. సాక్షాత్తు పార్లమెంటులో విపక్షాలన్నీ ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆందోళనకు దిగితే.. తాను ఉల్లిగడ్డలను పెద్దగా వాడనని చెబుతూనే.. ధరల మీద ఆందోళన చెందుతుంటే ‘‘ఉల్లిగడ్డలు తినడం మానేయండి’’ అంటూ ఉచిత సలహా పారేశారు తెలుగింటి కోడలు నిర్మలమ్మ. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతూనే వున్నాయి. తొలుత విదేశాలకు […]

Rajesh Sharma

|

Dec 05, 2019 | 3:06 PM

ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతుంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా కూల్ తినడం మానేయమంటున్నారు. ఇదెక్కడో అన్న మాట కాదు.. సాక్షాత్తు పార్లమెంటులో విపక్షాలన్నీ ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆందోళనకు దిగితే.. తాను ఉల్లిగడ్డలను పెద్దగా వాడనని చెబుతూనే.. ధరల మీద ఆందోళన చెందుతుంటే ‘‘ఉల్లిగడ్డలు తినడం మానేయండి’’ అంటూ ఉచిత సలహా పారేశారు తెలుగింటి కోడలు నిర్మలమ్మ.

గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతూనే వున్నాయి. తొలుత విదేశాలకు ఎగుమతులు ఆపేస్తే చాలు దేశంలో ఉల్లి ధరలు అవే తగ్గిపోతాయని లాజిక్ లేని పరిష్కారాన్ని కేంద్రం తెరమీదికి తెచ్చింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లోనే ఈ ధరలు పెరుగుతున్నందున రాష్ట్రాల మధ్య పంపిణీని సమన్వయం చేస్తే చాలన్న చర్యలు కనిపించాయి. కానీ ఇవేవీ ఉల్లి ధరలను నియంత్రించలేకపోవడంతో సామాన్య ప్రజానీకం ఉల్లిగడ్డలను కొనలేక అవస్థలు పడుతున్నారు.

ప్రజల అవస్థలను పార్లమెంటు వేదికగా విపక్షాలు ఎండగడుతున్నాయి. గత మూడు రోజులుగా ఏదో ఒక రూపంలో ఉల్లి ధరలు పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తావనకు వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో పలువురు ఉల్లి ధరలను నియంత్రించాలంటూ నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. ఉల్లి ధరలపై ఆందోళన వద్దంటూనే వాటిని తినడం మానేస్తే.. డిమాండ్ తగ్గుతుందని, ఫలితంగా ధరలు వాటంతట అవే దిగొస్తాయని ఉచిత సలహా ఇచ్చేశారు.

నిర్మల సీతారామన్ స్టేట్‌మెంట్ విపక్ష కాంగ్రెస్ నేతలకు అందివచ్చిన అవకాశంగా దక్కింది. నిర్మల కామెంట్లను బేస్ చేసుకుని లైమ్‌లైట్‌లోకి వచ్చారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. బుధవారం జైలు నుంచి బయటికొచ్చిన చిదంబరం ఇవాళ పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ఉల్లి ధరలను కంట్రోల్ చేయలేని మోదీ ప్రభుత్వం ఎలా వుంది యువతా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు చిదంబరం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu