చక్కా జామ్ సందర్భంగా ఖలిస్తానీ పతాకం కనబడిందా ? ఆరా తీస్తాం, రైతునేత రాకేష్ తికాయత్.

| Edited By: Pardhasaradhi Peri

Feb 07, 2021 | 11:55 AM

పంజాబ్ లోని లూధియానాలో శనివారం చక్కా జామ్ నిర్వహిస్తున్న సందర్భంగా నిషిధ్ద ఖలిస్తానీ భింద్రన్ వాలే ని పోలిన ఓ పతాకం ఓ ట్రాక్టర్ పై..

చక్కా జామ్ సందర్భంగా ఖలిస్తానీ పతాకం కనబడిందా ? ఆరా తీస్తాం, రైతునేత రాకేష్ తికాయత్.
Follow us on

పంజాబ్ లోని లూధియానాలో శనివారం చక్కా జామ్ నిర్వహిస్తున్న సందర్భంగా నిషిధ్ద ఖలిస్తానీ భింద్రన్ వాలే ని పోలిన ఓ పతాకం ఓ ట్రాక్టర్ పై కనబడిన ఉదంతం మీద ఆరా తీస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. ఈ ఘటన జరిగి ఉంటే అది తప్పేనని, ఖలిస్థాన్ ను నిషేధించిన నేపథ్యంలో ఆ పతాకాన్ని ప్రదర్సించాల్సింది కాదని ఆయన అన్నారు. దీనిపై స్థానికులతో మాట్లాడతానని, నిజంగా ఇది జరిగి ఉంటే  దాన్ని ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే చిత్రంతో పోలిన ఓ పతాకం ఓ ట్రాక్టర్ పై నిన్న కనిపించింది.

లోగడ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ సందర్భంగా భింద్రన్ వాలే మరణించాడు. సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్ రాష్ట్రం కావాలని భింద్రన్ వాలేతో బాటు నాడు పలువురు ఖలిస్థాన్ నేతలు పోరాడారు. అయితే దీన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికీ పంజాబ్ లో పలువురు చాటుమాటున ఖలిస్తానీ నినాదాన్ని లేవనెత్తుతున్నారు. ఇటీవల రైతుల ఆందోళనలో ఈ నిషిద్ధ సంస్థకు చెందిన కొందరు పాల్గొన్నారన్న అనుమానంపై జాతీయ దర్యాప్తు సంస్థ సుమారు 40 మందికి పైగా రైతులకు నోటీసులు జారీ చేసింది. వారిని ఢిల్లీ లోని తమ కార్యాలయంలో రెండు రోజులపాటు విచారించింది. అయితే ఈ  వారి నుంచి నిర్దిష్టమైన సమాచారమేదీ లభించలేదు.

Also Read:

IPS Officer Alleges Dowry Harassment:ఐపీఎస్ ఆఫీసర్ కు తప్పని వరకట్న వేధింపులు.. భర్త , అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు

ఎన్నికలొస్తున్నాయి మరి ! నేడు బెంగాల్, అస్సాం రాష్ట్రాలను విజిట్ చేయనున్న ప్రధాని మోదీ