చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. భార్యకు మరో పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..

|

Dec 18, 2021 | 11:56 AM

ఓ వివాహితుడు 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు తెలిసిన చోటంతా వెతికారు. అయినా ఫలితం లేకపోయింది....

చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. భార్యకు మరో పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్..
Jail
Follow us on

ఓ వివాహితుడు 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు తెలిసిన చోటంతా వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. అందరు అతడు చనిపోయాడని భావించారు. అంత్యక్రియలు కూడా చేశారు. అతడి భార్య మరో పెళ్లి చేసుకుని పిల్లలతో వెళ్లిపోయింది. ఛావీ కుమార్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అలా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు సడన్‎గా పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఛవీ కుమార్ సజీవంగా ఉన్నట్లు తెలిసింది.. అదీ పాకిస్తాన్ జైలులో ఉన్నట్లు తేలింది. మానసికంగా స్థితి సరిగా లేని ఛవీ కుమార్‌ వాంగ్మూలాలను ధృవీకరించడం కోసం జైలు అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఛవీ గుర్తింపును క్రాస్ చెక్ చేయడానికి, మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసుల స్పెషల్ బ్రాంచ్‌కు ఒక లేఖ పంపింది. అది బక్సర్‌లోని SP కార్యాలయానికి చేరింది.

బక్సర్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలాఫత్‌పూర్‌కు చెందిన వ్యక్తి గురించి పోలీసులు విచారణ చేశారు. “బుధవారం స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి మాకు లేఖ అందిందని.. ఆ తర్వాత గ్రామానికి వెళ్లి గ్రామస్థుల నుంచి సమాచారం సేకరించి లేఖలో పేర్కొన్న వివరాలతో క్రాస్‌ చెక్‌ చేశామని, గ్రామానికి చెందిన వ్యక్తి కనిపించకుండా పోయాడని స్థానికులు తెలిపారు. మేము ఛవి తల్లిని కలిశాము. ఆమె అతనిని గుర్తించింది ”అని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లోని SHO అమిత్ కుమార్ తెలిపారు.

మానసిక స్థితి సరిగా లేని ఛవీ పెళ్లయిన రెండేళ్లకే 2009లో తప్పిపోయాడని.. అప్పటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చనిపోయాడని భావించి అంత్యక్రియలు కూడా చేశారని అధికారి చెప్పారు. “ఛవి ఇంకా బతికే ఉన్నాడని మేము తల్లికి చెప్పినప్పుడు ఆమె ఉద్వేగానికి లోనైంది, అతని కొడుకును తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని” అని కుమార్ చెప్పారు. “విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి స్పెషల్ బ్రాంచ్‌కు లేఖ వచ్చింది. అతను ఎలా పాకిస్తాన్ ఎల్ వెళ్లాడనేది పేర్కొనలేదన్నారు.

Read Also.. Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జూ. ఆర్టిస్టులతో పాటు ముగ్గురు మృతి..(వీడియో)