Viral News: సోషల్ మీడియా వినియోగంతో సమాచార మార్పిడి సులభంగా మారిందని సంతోషించాలో.. దీనివల్ల పెరుగుతోన్న తప్పుడు ప్రచారాలను చూసి దిగులు చెందాలో అర్థం కానీ పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తను నమ్మాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఈ క్రమంలోనే రోజుకో వార్త నెట్టింట హంగామా చేస్తుంది. తాజాగా ప్రధాన మంత్రి రంబన్ సురక్ష యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం 4వేల ఆర్థిక సాయం చేస్తుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన జనాలు నిజమేనేమో అని సంబరపడిపోతున్నారు. కొందరు వ్యక్తులు ఆ పథకం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా? అంటూ ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.
పరిస్థితి తేడా కొడుతుండటంతో ఈ పథకం విషయమై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అధికారికంగా స్పందించింది. ప్రధాన మంత్రి రంబన్ సురక్ష యోజన పథకం పేరుతో జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని హితవుచెప్పింది. ఇలాంటి వార్తలు తమ దృష్టికి వస్తే ఒకటికి పదిసార్లు నిర్ధారించుకోవాలని సూచించింది. కాగా, పీఐబీ క్లారిటీతో గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ఈ ఫేక్ ప్రచారానికి చెక్ పడినట్లైంది.
Also read:
Viral Video: ‘‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’.. హాస్టల్‌లో చిన్నారిని ఓదార్చిన మరో చిన్నారి!
Aliens in Sea: సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపాలు.. అవి చూసి అవాక్కయిన శాస్త్రవేత్తలు..
Farmers: పాపం రైతన్న.. జింక పేరు వింటే చాలు హడలిపోతున్నారు.. అంతలా భయపడటానికి కారణమేంటంటే..