మాజీ ప్రధాని మన్మోహన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

| Edited By:

May 12, 2020 | 2:28 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆదివారం నాడు.. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో.. ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను కార్డియో-థొరాసిక్ వార్డులో అడ్మిట్ చేశారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారథ్యంలో ఆయనకు చికిత్స అందించారు. కేవలం రెండ్రోజుల్లోనే కోలుకోవడంతో.. మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ […]

మాజీ ప్రధాని మన్మోహన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
Follow us on

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆదివారం నాడు.. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో.. ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను కార్డియో-థొరాసిక్ వార్డులో అడ్మిట్ చేశారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారథ్యంలో ఆయనకు చికిత్స అందించారు. కేవలం రెండ్రోజుల్లోనే కోలుకోవడంతో.. మంగళవారం మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.
కాగా, అంతకుముందు ట్రీట్మెంట్‌లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా ఆయనకు జ్వరం రావడంతో.. ఆయనకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే రిపోర్టుల్లో నెగిటివ్ రావడంతో.. కరోనా సోకలేదని నిర్ధారించారు. ఇక మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలంటూ ఇవాళ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.