AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు దొరకదంటూ పుకార్లు.. విషయం తెలిసి షాక్ తిన్న అధికారులు..!

సోషల్ మీడియా పుకార్ల గురించి తెలిసిందే. ఇందులో వైరస్ అయ్యే న్యూస్‌లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు. ఒక్కసారి ఇలా వైరల్ అయ్యే వాటిని నిజమని నమ్ముతారు అనేక మంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని.. ఇతరులకు చెప్తూ ఉండేసరికి.. కొన్ని వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మరో రెండు నెలలపాటు ఉప్పు దొరకదంటూ.. ఎవరో స్టార్ట్ చేసిన ఓ రూమర్.. ఒక‌రి నుంచి […]

ఉప్పు దొరకదంటూ పుకార్లు.. విషయం తెలిసి షాక్ తిన్న అధికారులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 12, 2020 | 2:13 PM

Share

సోషల్ మీడియా పుకార్ల గురించి తెలిసిందే. ఇందులో వైరస్ అయ్యే న్యూస్‌లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు. ఒక్కసారి ఇలా వైరల్ అయ్యే వాటిని నిజమని నమ్ముతారు అనేక మంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని.. ఇతరులకు చెప్తూ ఉండేసరికి.. కొన్ని వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మరో రెండు నెలలపాటు ఉప్పు దొరకదంటూ.. ఎవరో స్టార్ట్ చేసిన ఓ రూమర్.. ఒక‌రి నుంచి ఒక‌రికి చేరి, చివ‌రికి రాష్ట్ర‌మంత‌టా పాకిపోయింది. ఉప్పు దొరకదంటూ పుకార్లు రావడంతో.. అంతా ఒక్కసారిగా దుకాణాలకు క్యూ కట్టారు. అంతేకాదు.. బస్తాలకొద్ది ఉప్పు కొనుక్కుంటూ.. నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఇదే అదనుగా పలుచోట్ల ఉప్పు ధరలను కూడా పెంచేశారు. అయితే పుకార్లను అవకాశంగా చేసుకుని.. పలువురు డీలర్లు ఉప్పు స్టాక్‌ గోదాముల్లో ఉంచి కృత్రిమ కొరత సృష్టించేందుకు యత్నించారు. అయితే ఉప్పు గురించి వైరల్ వార్తలు తెలుసుకున్న అధికారులు.. వెంటనే రంగంలోకి దిగి..రాష్ట్రంలోని రేషన్ షాపుల‌లో, మార్కెట్లో ఉప్పు నిల్వల గురించి ఆరా తీశారు. రాష్ట్రంలో తగినంత ఉప్పు నిల్వ‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు.

రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఉప్పు డీలర్ల సంస్థలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పలుచోట్ల అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పలు షాపులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. ఇక ఉప్పు విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. రాష్ట్రానికి కావాల్సినంత ఉప్పు నిత్యం దిగుమతి అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Follow Us
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!