బీహార్ మాజీ డీజీపీకి మొండి చెయ్యి, అందని జేడీ-యూ టికెట్

బీహార్ ఎన్నికల్లో తన బక్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయదలచిన మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేకి జేడీ-యూ మొండి చెయ్యి చూపింది. ఆయనకు టికెట్ లభించలేదు. డీజీపీ పదవికి రాజీనామా చేసిన ఆయన… రాజకీయ రంగ ప్రవేశం చేద్దామనుకున్నా ఆ ఆశలు నెరవేరలేదు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని విమర్శించినందుకు పాండేకి టికెట్ నిరాకరించారని భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ కేసులో పాండే లోగడ ముంబై పోలీసుల తీరును దుయ్యబట్టిన సంగతి విదితమే. ఇప్పుడు […]

బీహార్ మాజీ డీజీపీకి మొండి చెయ్యి, అందని జేడీ-యూ టికెట్

Edited By:

Updated on: Oct 09, 2020 | 5:52 PM

బీహార్ ఎన్నికల్లో తన బక్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయదలచిన మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండేకి జేడీ-యూ మొండి చెయ్యి చూపింది. ఆయనకు టికెట్ లభించలేదు. డీజీపీ పదవికి రాజీనామా చేసిన ఆయన… రాజకీయ రంగ ప్రవేశం చేద్దామనుకున్నా ఆ ఆశలు నెరవేరలేదు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని విమర్శించినందుకు పాండేకి టికెట్ నిరాకరించారని భావిస్తున్నారు. సుశాంత్ సింగ్ కేసులో పాండే లోగడ ముంబై పోలీసుల తీరును దుయ్యబట్టిన సంగతి విదితమే. ఇప్పుడు బక్సర్ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థిగా మాజీ పోలీసు పరశురామ్ చతుర్వేది పోటీ చేస్తున్నాడు. గుప్తేశ్వర్ పాండే కాళ్లకు మొక్కి నేను ప్రచారం చేసుకుంటా అని ఈ మాజీ పోలీసు కానిస్టేబుల్ అంటున్నాడు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us