ఢిల్లీ అల్లర్లలో నా హస్తం, ఆప్ మాజీ ఎమ్మెల్యే తాహిర్ హుసేన్

| Edited By: Pardhasaradhi Peri

Aug 03, 2020 | 2:55 PM

ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో తన హస్తం ఉందని ఆప్ మాజీ ఎమ్మెల్యే తాహిర్ హుసేన్ మొదటిసారిగా అంగీకరించాడు. పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆ సందర్భంగా ఢిల్లీలో..

ఢిల్లీ అల్లర్లలో నా హస్తం, ఆప్ మాజీ ఎమ్మెల్యే తాహిర్ హుసేన్
Follow us on

ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో తన హస్తం ఉందని ఆప్ మాజీ ఎమ్మెల్యే తాహిర్ హుసేన్ మొదటిసారిగా అంగీకరించాడు. పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆ సందర్భంగా ఢిల్లీలో పెద్దఎత్తున అల్లర్లు, ఘర్షణలు జరిగాయి. తన పొలిటికల్ పవర్ ని, డబ్బును అడ్డుపెట్టుకుని ఒక  వర్గానికి గుణపాఠం చెప్పాలనుకున్నానని ఢిల్లీ పోలీసుల విచారణలో తెలిపాడు. జనవరి 8 న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్ధి ఉమర్ ఖాలిద్ ని కలుసుకున్నానని, హింసను రెచ్ఛగొట్టేందుకు గ్లాస్ బాటిల్స్, పెట్రోలు, యాసిడ్, రాళ్లు తదితరాలను తన ఇంటిపైన ఉంచానని తాహిర్ చెప్పాడు.

ఫిబ్రవరి 24 న నా కుటుంబాన్ని పంపివేసి మా ఇంటిపైనుంచి నిరసనకారులపై వీటితో నేను, నా అనుచరులు నిరసనకారులపై దాడికి పాల్పడ్డాం’ అని నదురుబెదురూ లేకుండా తెలిపాడు. వీరి రాళ్ళ దాడిలో అనేకమంది ఆందోళనకారులు గాయపడ్డారు. నాడు జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్యలో తన హస్తం ఉందని తాహిర్ హుసేన్ అంగీకరించాడు.