Delhi Corona: దేశ రాజధాని అయిన ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి సోకుతుంది. ఢిల్లీ జనాభా సుమారు రెండు కోట్లు కాగా, అందులో సగం మంది కరోనా బారిన పడి కోలుకున్నారని ఇటీవల ఐదో సెరోలాజికల్ సర్వేలో వెల్లడైంది. దేశ రాజధానిప్రాంతంలో కరోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ సర్కార్ ఇప్పటికే పలు మార్లు సెరోలాజికల్ సర్వే నిర్వహించింది. తాజాగా ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు చేపట్టిన ఐదో విడత సెరోసర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి మున్సిపల్ వార్డు నుంచి వంద చొప్పున మొత్తం 28 వేల మంది నుంచి నమూనాలను సేకరించారు.
గత నాలుగు సెరో సర్వేల్లో 23 నుంచి 25 శాతం మందిలోనే యాంటీబాడీలను గుర్తించగా, ఐదో విడత సర్వేల్లో 60 శాతం మందిలో కరోనాను తట్టుకునే రోగనిరోధకాలను గుర్తించారు. సుమారు 60శాతం మంది ఢిల్లీ ప్రజల్లో కరోనాను తట్టుకునే ప్రతిరోధకాలు ఉన్నట్లు యాంటీబాడీ పరీక్షల్లో గుర్తించారు. అంటే దేశ రాజధానిలోని సుమారు సగం మంది ప్రజలు వారికి తెలియకుండానే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నట్లు సర్వేలో తేలింది.
దీంతో ఢిల్లీలోని సగం జనాభా కరోనాను తట్టుకునే రోగనిరోధకశక్తిని కలిగి ఉందని, వారంతా హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుకున్నారని సర్వే ద్వారా తేలింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాదిగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పటి వరకు వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభించింది. గత పది రోజులుగా దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ కారణంగా కేసుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 148 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..