కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటన.. మోదీ వ్యూహమేంటి ?

|

Oct 29, 2019 | 2:13 PM

యూరోపియన్ యూనియన్ ఎంపీల ప్రతినిధిబృందమొకటి మంగళవారం కశ్మీర్ పర్యటనకు శ్రీకారం చుట్టింది. నిన్న ప్రధాని మోదీని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిసిన ఈ ట్రూప్.. ఇవాళ ఉదయం కశ్మీర్ లో అడుగు పెట్టింది. చాలావరకు మితవాద పార్టీలకు చెందిన ఎంపీలు ఈ టూర్ కు సంబంధించి ప్రభుత్వాన్ని అనుమతి కోరడం విశేషం. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం గత ఆగస్టు 5 న రద్దు చేసిన అనంతరం […]

కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటన.. మోదీ వ్యూహమేంటి ?
Follow us on

యూరోపియన్ యూనియన్ ఎంపీల ప్రతినిధిబృందమొకటి మంగళవారం కశ్మీర్ పర్యటనకు శ్రీకారం చుట్టింది. నిన్న ప్రధాని మోదీని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిసిన ఈ ట్రూప్.. ఇవాళ ఉదయం కశ్మీర్ లో అడుగు పెట్టింది. చాలావరకు మితవాద పార్టీలకు చెందిన ఎంపీలు ఈ టూర్ కు సంబంధించి ప్రభుత్వాన్ని అనుమతి కోరడం విశేషం. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం గత ఆగస్టు 5 న రద్దు చేసిన అనంతరం ఓ అంతర్జాతీయ బృందం ఈ లోయను సందర్శించడం ఇదే మొదటిసారి. మొత్తం 27 మంది ఎంపీల్లో.. ముగ్గురు మాత్రమే లెఫ్ట్ లేదా లిబరల్ పార్టీలకు చెందినవారు. వీరంతా ప్రయివేటు హోదాలో ఇండియాకు వచ్చారు. ఈయూ బృందం ఇక్కడి ఆర్మీ హెడ్ క్వార్ట్రర్స్ ని విజిట్ చేసి… అక్కడి సిబ్బందితో లంచ్ చేయవచ్చు.
ఈ ఎంపీలను రెండు హోటళ్లకు తరలిస్తారని, ఆయా చోట్ల వారు వ్యాపార వర్గాలను, బోటు యజమానులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారని తెలిసింది.
కశ్మీర్ రాష్ట్రంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు ఇది తమకు మంచి అవకాశమని నాథన్ గిల్ అనే ఎంపీ పేర్కొన్నారు. కాగా-రెండు నెలలుగా ఈ రాష్ట్రంలో ఆంక్లలు అమల్లో ఉన్నాయని, పైగా ఇక్కడి రాజకీయ నేతలను విజిట్ చేసేందుకు అనుమతించని ప్రభుత్వం ఓ ఫారిన్ డెలిగేషన్ ని అనుమతించడమేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీరి విజిట్ పై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. వీరికి అనుమతినిచ్చి .. భారతీయ ఎంపీలను నిరాకరించడం చాలా తప్పు అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ‘ ఇది ప్రజాస్వామ్యానికే అవమానం ‘ అని ఖండించారు. ‘ బెస్ట్ బీటింగ్ చాంపియన్ ఆఫ్ నేషనలిజం ‘ అంటే ఇదేనని మరో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ సెటైర్ వేశారు.
ఇదిలా ఉండగా… ఈ బృందాన్ని నిన్న ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. కశ్మీర్ తో బాటు దేశంలోని వివిధ ప్రాంతాలను వీరు సందర్శించడం తమకు హర్షణీయమన్నారు. ఇక్కడి సాంస్కృతిక, మత సామరస్య అంశాలను, అభివృద్దిని వారు తెలుసుకోగలుగుతారు అని మోదీ పేర్కొన్నారు.
అయితే ఈయూ ప్రతినిధుల పర్యటన పూర్తిగా ఓ స్వచ్చంద సంస్థ ఆహ్వానం మేరకేనని యూరోపియన్ యూనియన్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఢిల్లీలోని పలు ఈయూ దౌత్య కార్యాలయాలకు నిన్నటివరకు కూడా వీరు వస్తున్న విషయం తెలియనే తెలియదట.
కశ్మీర్ రాష్ట్రంలో ముగ్గురు మాజీ సీఎంలతో సహా పలువురు రాజకీయ నేతలను నిర్బంధించి.. వారి పర్యటనలను నిషేధించిన ప్రభుత్వం ఈయూ ఎంపీల విజిట్ కి పర్మిషన్ ఇవ్వడం సమంజసం కాదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు విదేశీ జర్నలిస్టులను అనుమతించాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో.. బహుశా పరోక్షంగా ఇందుకు మోదీ సర్కార్ అంగీకరించిన ఫలితమే ఇదని కూడా తెలుస్తోంది.