కేరళలో ఖరీదైన కుక్కపిల్ల చోరీ ఘటన సంచలనం రేపింది. కొచ్చిలోని నెట్టూర్‌లోని ఓ పెట్‌షాప్‌లో కుక్కపిల్లను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. దాంతో దుకాణం యజమాని చోరీకి గురైన పెంపుడు కుక్కను ఎలాగైనా తిరిగి పొందాలనుకున్నాడు. కుక్కపిల్ల చోరీకి గురైన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిందనుకున్న తన కుక్కపిల్లను కొన్ని రోజుల తరువాత ఎట్టకేలకు తిరిగి పొందాడు. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. కుక్కపిల్లను చోరి చేసింది ఇద్దరు యువ ఇంజనీరింగ్ విద్యార్థులుగా తేలింది. దాదాపు రూ.20,000 ఖరీదు చేసే స్పిట్జ్ జాతికి చెందిన కుక్కపిల్లను బైక్‌పై వచ్చిన ఒక యువతి, యువకుడు దొంగిలించినట్టుగా సీసీ ఫుటేజ్‌ఆధారంగా గుర్తించారు. తలకు హెల్మెట్ పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి కుక్కపిల్లను హెల్మెట్‌లో దాచిపెట్టుకుని అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, అదే కుక్కపిల్ల కోసం మరో వినియోగదారుడు దుకాణానికి రావడంతో పెంపుడు జంతువు చోరీకి గురైందని షాపు యజమాని,సిబ్బంది గుర్తించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా యువకుడు కుక్కపిల్లను దొంగిలించినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులే వైట్టిలలోని మరో దుకాణంలో కుక్కల ఆహారాన్ని కూడా దొంగిలించారు. కుక్కపిల్లను దొంగిలించిన వ్యక్తి, మహిళ పక్క రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాసిత్ పనంగాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, వారు వచ్చిన బైక్ నంబర్ ప్లేట్ విజువల్స్‌లో స్పష్టంగా లేదు.దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
వారు మరొక దుకాణంలో దొంగిలించడానికి ప్రయత్నించారు. కానీ షాప్ యజమాని వారిని పట్టుకోవడంతో, వారు ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ని ఉపయోగించి డబ్బు చెల్లించారు. ప్రస్తుతం ఈ లావాదేవీకి సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు దర్యాప్తును కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్, శ్రేయ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పనంగాడ్ పోలీసులు వారిని కర్ణాటకలోని కర్కాలా నుంచి అరెస్టు చేశారు. నెట్టూరులోని పెట్ షాపులో చోరీకి గురైన రూ.20 వేల విలువైన 45 రోజుల వయసున్న కుక్కపిల్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన జనవరి 28న రాత్రి 7 గంటలకు జరిగింది. పిల్లిని కొంటారా అని ఇద్దరూ నెట్టూరులోని దుకాణానికి చేరుకున్నారు. దుకాణదారుడి దృష్టి మరల్చిన ఆ ఇద్దరూ ఆ కుక్కపిల్లను బోనులోంచి బయటకు తీసి హెల్మెట్‌లో దాచుకున్నారు. విద్యార్థులు మూడు స్పిట్జ్ కుక్కపిల్లల నుండి ఒకదాన్ని దొంగిలించారు. అలప్పుజాకు చెందిన ఓ వ్యక్తి డిమాండ్ మేరకు వాటిని దుకాణానికి తీసుకొచ్చారు. ఇద్దరు వెళ్లిన తర్వాత అలప్పుజాకు చెందిన వ్యక్తి కుక్కపిల్ల కోసం వచ్చినప్పుడు దొంగతనం జరిగిన విషయం దుకాణం యజమానికి తెలిసింది. కుక్కపిల్ల అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని తొలుత భావించాడు. అయితే ఆ తర్వాత సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలించారు. వీరు ప్రయాణిస్తున్న మార్గంలోని సీసీటీవీ విజువల్స్‌ను కూడా పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..