Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త నిబంధనలు ప్రకటిస్తాం.. ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుళ్లపై స్పందించిన నితిన్ గడ్కరీ

|

Apr 21, 2022 | 7:18 PM

Nitin Gadkari: ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో మరో వైపు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆయా వాహనాల ..

Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త నిబంధనలు ప్రకటిస్తాం.. ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుళ్లపై స్పందించిన నితిన్ గడ్కరీ
Follow us on

Nitin Gadkari: ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో మరో వైపు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆయా వాహనాల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters) అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల వల్ల అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మా దృష్టికి వచ్చింది. జరిగిన ఘటనలపై ఒక కమిటీ వేస్తున్నాము. పూర్తి నివేదిక వచ్చాక ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఎలక్ట్రిక్ వాహణాలకు కొత్త నిబంధనలు ప్రకటిస్తాం..

ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయంతో ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. వాహనాల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త నిబంధనలు ప్రకటిస్తామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కంపెనీలు పొరపాటు చేస్తే వాహనాలను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు.

ఇక నిన్న నిజామాబాద్ లో ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌ ప్రాంతంలో నివాసం ఉండే కళ్యాణ్‌ రోజులాగే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీని అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని హాలులో చార్జింగ్‌ పెట్టాడు. అనంతరం తాత రామస్వామి(80), నాన్నమ్మ కమలమ్మతో కలిసి అదే హాల్‌లో పడుకున్నాడు. మరో గదిలో రామస్వామి కుమారుడు ప్రకాశ్‌, కోడలు కృష్ణవేణి పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున బ్యాటరీ భారీ శబ్ధంతో పేలిపోయింది. శబ్ధానికి గదిలో నిద్రిస్తున్న ప్రకాశ్‌, కృష్ణవేణి బయటికు పరుగులు పెట్టారు. అంతలోనే బ్యాటరీలోని కెమికల్‌ హాల్‌లో వ్యాపించి దాని ద్వారా మంటలు రామస్వామి, కమలమ్మ, కళ్యాణ్‌కు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కృష్ణవేణికి సైతం గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామస్వామిని ఆయన కుమారుడు ప్రకాష్‌ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి:

RapidEVChargeE: ఎలక్ట్రిక్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. ర్యాపిడ్‌ ఈవీ చార్జింగ్ యూనిట్‌!

Jio,Vodafone Idea: జియో, వొడాఫోన్‌ ఐడియాలకు షాకిచ్చిన యూజర్లు.. దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌