కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. ప్రజలకు డబ్బు ఆశచూపించి.. ఓట్లను సాధించాలనుకుంటున్న కొందరి రాజకీయ నేతల అక్రమ డబ్బును ఎక్కడిక్కడ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలోని మైసూరులో సుమారు రూ. కోటి నగదును ఎన్నికల కమిషన్, ఐటీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మైసూరుకు చెందిన కె. సుబ్రహ్మణ్య రై అనే వ్యాపారి ఇంట్లో పక్కా సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు, ఎన్నికల కమీషన్‌కు భారీ మొత్తంలో డబ్బు బయటపడింది. ఆయన ఇంటి ఆవరణలోని మామిడి కాయలు ఉంచే అట్టపెట్టెలో సుమారు రూ. 1 కోటి నగదు దాచి ఉంచినట్లు గుర్తించారు. ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు వ్యాపారి పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి అశోక్ రైకు సుబ్రహ్మణ్య సోదురుడు అని తెలుస్తోంది.