కోవిద్ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నవారిలో కొందరికి మాగ్నెటిజం పవర్స్ (అయస్కాంత శక్తి) కలుగుతున్న ఉదంతాలు మెల్లగా పెరుగుతున్నాయి. మొదట మహారాష్ట్ర..నాసిక్ లో, అనంతరం ఝార్ఖండ్ లోని హజారీ బాగ్ కు చెందిన వ్యక్తిలో ఇలా మాగ్నెటిక్ పవర్ కలిగిన ఘటనలు చూశాం. వాఫ్రి శరీరాలకు చెంచాలు, నాణేలు మొదలైనవి అంటించగానే అవి అతుక్కుపోయి కనిపించాయి. తాజాగా బెంగాల్ లో నార్త్ 24 పరగణాల జిల్లాలోని బరాసాత్ ప్రాంతానికి చెందిన 66 ఏళ్ళ అనిమా నాసర్ అనే మహిళ కూడా ఈ వింతైన అనుభవాన్ని ఎదుర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తనకు కూడా ఇలా జరిగిందని ఆమె చెబుతోంది.
ఉత్తర బెంగాల్ లో ఎవరికో ఇలాంటి అనుభవమే కలిగినట్టు తాను విన్నానని, ఆశ్చర్యపోయానని, ఇప్పుడు తాను కూడా ఈ విధమైన అనుభవానికి లోనయ్యానని ఆమె తెలిపింది. చూద్దామని తన కుమారుడు కొన్ని నాణేలను, స్పూన్లను తన చేతికి అంటించగానే అవి అతుక్కుపోయానని ఆమె చెప్పింది. అయితే ఇది వ్యాక్సిన్ లోపం కాదని తాను భావిస్తున్నట్టు వెల్లడించింది. ఏమైనా ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది అనిమా పేర్కొంది. ఆమె కుమారుడు.. దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆరోగ్య శాఖ అధికారులకు తనీ విషయాన్నీ వివరిస్తానని చెప్పాడు.
కానీ ఇదంతా ట్రాష్ అని కేంద్రం కొట్టి పారేస్తూ.. వ్యాక్సిన్ లో ఏ లోపమూ లేదని, పదార్థాలను ముఖ్యంగా లోహాలను ఆకర్షించే ఎలాంటి ఇన్ గ్రేడియంట్లనూ వీటిలో కలపడం లేదని ప్రకటించింది. ఏమైనా.,, ఈ వింతపై పరిశోధన జరగాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.
Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.
Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.
యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.