ఎంత కష్టమొచ్చిందో పాపం.. పళ్లు ఊడిపోయాయని.. ప్రాణం తీసుకున్న వ్యక్తి.. ఎక్కడంటే?

తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పళ్లు ఊడిపోవడంతో ఆహారం సరిగ్గా తినలేకపోతున్నాననే బాధ, అనారోగ్యం కారణంగా ఓ వృద్ధుడి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎంత కష్టమొచ్చిందో పాపం.. పళ్లు ఊడిపోయాయని.. ప్రాణం తీసుకున్న వ్యక్తి.. ఎక్కడంటే?
Madurai Jaihindpuram Suicide Case

Updated on: Jul 19, 2026 | 11:03 AM

పళ్లు ఊడిపోయి.. ఆహారం సరిగ్గా తీసుకోలేక పోతున్నాననే బాధతో 60 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు రాష్ట్రం మదురైలోని జైహింద్‌పురం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న బాలసుబ్రమణియన్ (60) అనే వృద్ధుడికి వయసు పైబడటంతో ఇటీవలే పళ్లన్నీ ఊడిపోయాయి. దీనికి తోడు ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే పళ్లు లేకపోవడంతో ఆహారాన్ని సరిగ్గా నమలలేక, తినలేక అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో అనారోగ్యం, ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బాలసుబ్రమణియన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విగతజీవిగా కనిపించిన బాలసుబ్రమణియన్‌ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us