
బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపింల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న పోలింగ్ రోజు జరిగిన తీవ్రమైన అవకతవకలు నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజూ ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేలా సంఘటనలు చోటుచేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అధికారులకు ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ ఫాల్టా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాంల్లో మే 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. నియోజవర్గ వ్యాప్తంగా సహాయక బూత్‌లతో కలిపి మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో 21వ రోజు ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 వరకు పోలింగ్ జరగనున్నట్టు స్పష్టం చేసింది. పోలింగ్ పూర్తైన మూడు రోజులకే అంటే మే 24న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.