Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు

ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రస్తుతానికి, ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు. అయినా భూ ప్రకంపనలు తీవ్రంగా కనిపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్ 112ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు
Earthquake In Delhi

Updated on: Feb 17, 2025 | 9:52 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా ఇళ్లు కంపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి.. రోడ్లపైకి వెళ్లిపోయారు. అయితే ఈ భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రస్తుతానికి, ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు. అయినా భూ ప్రకంపనలు తీవ్రంగా కనిపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్ 112ను ఏర్పాటు చేశారు.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. భూకంపం నేపథ్యంలో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. జనవరి 23న, చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు, జనవరి 11న, ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంప జోనేషన్ మ్యాప్ ప్రకారం, ఢిల్లీ భూకంప జోన్ 4 పరిధిలోకి వస్తుంది, దీని వలన భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.