దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2 గా నమోదు.. భయాందోళనలో స్థానిక ప్రజలు..

దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2 గా నమోదు.. భయాందోళనలో స్థానిక ప్రజలు..

Updated on: Dec 18, 2020 | 12:45 AM

దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. హర్యానాలోని గుర్గావ్‌కు నైరుతిలో 48 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక‌ృతమైనట్లు ప్రకటించింది. ఉపరితలం నుంచి 7.5 కిలోమీటర్ల లోతులో రాత్రి 11.46 ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు ఐఎమ్‌డి సీస్మోలజీ డైరెక్టర్ (ఆపరేషన్స్) జెఎల్ గౌతమ్ వివరించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం పక్కనే ఉన్న నోయిడా మరియు గురు గ్రామాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.