AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం పసివాడు.. నాన్న జైల్లో.. అమ్మ ఎక్కడో తెలియదు.. పుట్‌పాత్‌పై కుక్కతో పడుకుంటున్న..

తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలు వర్ణనాతీతం. ఆలనా పాలనా చూసుకునే వ్యక్తులు లేక ఒంటరిగా కుమిలిపోతుంటారు.

పాపం పసివాడు.. నాన్న జైల్లో.. అమ్మ ఎక్కడో తెలియదు.. పుట్‌పాత్‌పై కుక్కతో పడుకుంటున్న..
uppula Raju
|

Updated on: Dec 18, 2020 | 5:50 AM

Share

తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలు వర్ణనాతీతం. ఆలనా పాలనా చూసుకునే వ్యక్తులు లేక ఒంటరిగా కుమిలిపోతుంటారు. తినడానికి తిండిలేక కట్టుకోవడానికి దుస్తులు లేక పడుకోవడానికి ఇళ్లులేక బాధపడుతుంటారు. చేతికి దొరికన పని చేసుకొని ఆ రోజు గడిస్తే సరిపోతుందనుకుంటారు. అలాంటి అభాగ్యులు దేశంలోని ప్రధాన నగరాల్లో నిత్యం తారసపడుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పుట్‌పాత్‌పై కుక్కతో పాటు పడుకున్న పిల్లాడి ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో పుట్‌పాత్‌పై ఓ బాలుడు కుక్కతో పడుకొని నిద్రిస్తున్నాడు. అడిగితే అతడి పేరు అంకిత్ అని చెబుతున్నాడు. తల్లి, తండ్రి ఎక్కడ, ఏ ఊరు అని వివరాలు అడిగితే ఇలా చెబుతున్నాడు. తండ్రి జైలుకు వెళ్లాడని, తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయిందని అంటున్నాడు. తోడుగా ఉన్న డానీ అనే కుక్కతో రోజు పుట్‌పాత్ పైనే పడుకొంటానని తెలిపాడు. అంకిత్ స్థానికంగా బెలూన్లు అమ్ముతూ, టీ స్టాళ్లలో పనిచేస్తూ పొట్టనింపుకుంటున్నాడు. అయితే ఎముకలు కొరికే చలిలో పుట్‌పాత్‌పై కుక్కతో పడుకున్న అంకిత్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసింది. ఎవరైనా అంకిత్‌కు సాయం చేయాలని పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అంకిత్ లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నారు.

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్