‘వాళ్ళతో కలిసి సూట్ కేసులు మోస్తూ వెళ్ళండి’.. రాహుల్ పై నిర్మల ఫైర్

ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్ వద్ద వలస కార్మికులను  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి మాట్లాడిన తీరును ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ఓ 'డ్రామా'గా అభివర్ణించారు. వలస జీవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వారు కేంద్రాన్ని...

'వాళ్ళతో కలిసి సూట్ కేసులు మోస్తూ వెళ్ళండి'.. రాహుల్ పై నిర్మల ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2020 | 4:41 PM

ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్ వద్ద వలస కార్మికులను  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి మాట్లాడిన తీరును ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ఓ ‘డ్రామా’గా అభివర్ణించారు. వలస జీవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వారు కేంద్రాన్ని విమర్శించే ముందు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరింఛాలన్నారు.  వారి దగ్గర అదేపనిగా కూర్చుని సమయాన్ని వృధా చేసే బదులు వారితో కలిసి నడవాలని, వారి సూట్ కేసులను మోయాలని  ఆమె రాహుల్ ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి కోసం మరిన్ని రైళ్లు వేయాలని కోరాలని, తద్వారా వలస జీవులు త్వరగా తమ స్వస్థలాలకు చేరుకోగలరని నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు.

‘సోనియాకు ఇది నా వినయ పూర్వక విజ్ఞప్తి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్ వద్ద రాహుల్ గాంధీ శనివారం కొంతమంది వలస కార్మికులను కలిసి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖానికి మాస్క్ ధరించి వారితో ఆయన మాట్లాడిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వలస జీవుల్లో కొందరు యూపీకి, మరికొందరు మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారున్నారు. ఇప్పటికే వీరు హర్యానాలోని అంబాలా నుంచి 130 కి.మీ.దూరం నడిచారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు