Telegram: మూవీ లవర్స్ అలెర్ట్.. టెలిగ్రామ్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేస్తున్నారా? ఇదే మీకు హెచ్చరిక!

|

Jan 03, 2023 | 7:39 AM

మీకు టెలిగ్రామ్ ఉందా.? కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు టెలిగ్రామ్ గ్రూప్‌లలో చేరుతున్నారా.? అయితే ఇది మీకోసమే.

Telegram: మూవీ లవర్స్ అలెర్ట్.. టెలిగ్రామ్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేస్తున్నారా? ఇదే మీకు హెచ్చరిక!
Telegram App
Follow us on

మీకు టెలిగ్రామ్ ఉందా.? కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు టెలిగ్రామ్ గ్రూప్‌లలో చేరుతున్నారా.? అయితే ఇది మీకోసమే. తస్మాత్ జాగ్రత్త.. క్షణాల్లో మీ ఖాతా ఖాళీ అయినట్లే. 2022, డిసెంబర్ 20న జైపూర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ అకౌంట్ నుంచి రూ. 3.15 లక్షలు మాయం అయ్యాయి. అతడి ఫోన్‌కు ఎలాంటి మెసేజ్, ఓటీపీ రాలేదు. దీంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించగా.. కేవలం లింక్ సాయంతో సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడటం వల్ల ఇలా జరిగిందని అన్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది మూవీస్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు టెలిగ్రామ్ గ్రూప్‌లలో చేరుతున్నారు. ఆయా గ్రూప్స్‌లో మొదటగా డైరెక్ట్ డౌన్‌లోడ్‌ ఆప్షన్ ఇవ్వగా.. ఇప్పుడు కొన్నింటిల్లో మాత్రం ఆ ఆప్షన్‌కు బదులు లింక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోమని కొన్ని గ్రూప్స్ పెడుతున్నాయి. అయితే ఆ లింకులతో సైబర్ నేరగాళ్లు వైరస్‌ను పంపుతున్నారు. మీరు ఆ లింకుతో సినిమా డౌన్‌లోడ్‌ చేస్తే, సదరు వైరస్‌తో మీ ఫోన్‌లోని డేటాతో పాటు పూర్తి ఆపరేటింగ్ అంతా సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్తుంది. కనీసం మొబైల్‌కు ఎలాంటి మెసేజ్, ఓటీపీ రాకుండానే మీ ఖాతా నుంచి మనీ కట్ అవుతోంది. 2022లో దాదాపు 50 వేల మంది సుమారు రూ. 95 కోట్లు కోల్పోయారట. దీనంటికి మాల్వేర్ అనే వైరస్ కారణం అని నిపుణులు అంటున్నారు.

కాగా, ఈ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ వల్ల ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నట్లయితే.. 24 గంటల్లో 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఈ తరహా మోసాలన్నీ కూడా పైరేట్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతున్నాయని.. కొత్త సినిమాలు చూడాలనుకున్నవారు తొందరపడకుండా ఇలాంటి పైరేటడ్ లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.