పాక్‌‌కు చుక్కలు చూపి సగర్వంగా నిలబడ్డ ఫైటర్.. తేజస్‌ వచ్చేదాకా వాయుసేనకు వెన్నుముక..!

మిగ్‌-21 జెట్స్‌కు ఎంతోమంది పైలెట్లు ఎన్నో ముద్దు పేర్లు పెట్టుకున్నారు. అందులో ఒకటి.. 'పాంథర్'. నిజంగా అంతటి వేగమే దీనిది. డెల్టా వింగ్స్‌తో నిర్మించిన మిగ్‌-21.. మాక్-2 స్పీడ్‌ను అందుకోగలదు. అంటే.. ధ్వని కంటే రెండు రెటలు ఎక్కువ వేగం. టుంబోజెట్ ఆఫ్టర్‌ బర్నర్‌ ఇంజిన్‌తో తయారు చేసిన ఈ జెట్‌ ఫ్యూయెల్ కెపాసిటీ 2350 కేజీలు. ఫుల్‌ ట్యాంక్‌ నింపింతే... ఏకధాటిగా 1300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనికి డాగ్‌ ఫైటర్‌ అనే మరో పేరుంది. అంటే.. గాల్లో గింగిరాలు తిరుగుతూ గాల్లోనే దాడి చేయగలదు.

పాక్‌‌కు చుక్కలు చూపి సగర్వంగా నిలబడ్డ ఫైటర్.. తేజస్‌ వచ్చేదాకా వాయుసేనకు వెన్నుముక..!
Legend Of India Mig 21

Updated on: Sep 26, 2025 | 10:07 PM

ఇజ్రాయెల్‌.. ఒక చిన్న యూదు దేశం అయినప్పటికీ.. తన చుట్టూ ఉన్న 8 అరబ్‌ దేశాలను సింగిల్‌ హ్యాండిల్‌తో ఫేస్‌ చేస్తూ ఉంటుంది. 1967లో ఆరంటే ఆరే రోజుల్లో.. ‘ఈజిప్ట్, సిరియా, జోర్డాన్’.. ఈ అరబ్‌ దేశాలను యుద్ధంలో ఓడించింది. హిస్టరీలో ఆ యుద్ధానికున్న పేరు ‘ది సిక్స్‌ డే వార్’. జస్ట్‌ కొన్ని గంటల్లోనే మొత్తం అరబ్‌ ఎయిర్‌ఫోర్స్‌ను ఇజ్రాయెల్‌ నాశనం చేసిందంటే.. దాని వెనక కారణమేంటో తెలుసా. మిగ్‌-21. అక్కడెక్కడో రష్యా తయారు చేసిన మిగ్‌-21.. ఇరాక్‌లో మాత్రమే ఎగరాల్సిన మిగ్‌-21ను.. ఇజ్రాయెల్‌కు ‘ఎత్తుకొచ్చింది’ మొసాద్. మోస్ట్‌ ఇంట్రస్టింగ్‌ మొసాద్‌ ఆపరేషన్‌ అది. దాని గురించి ఇదే ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. దాని కంటే ముందు.. మరో విషయం. చరిత్రలో.. యుద్ధంలో అమెరికా ఓడిపోయిన సందర్భం ఒకటుంది తెలుసా..? వియత్నాం అనే అతిచిన్న దేశం అగ్రరాజ్యమైన అమెరికానే ‘గడగడగడ’లాడించింది. అమెరికన్‌ వార్ జెట్స్‌ పిట్టల్లా రాలిపోయాయి. కారణం.. మిగ్‌-21. అమెరికన్ ఫైటర్‌ జెట్స్‌లో హ్యూజ్‌ సక్సెస్‌ రేట్‌ ఉన్న వార్‌జెట్‌.. ఈ F-16. తమ F-16కు ప్రపంచంలోనే తిరుగులేదని చెప్పుకుంది అమెరికా. అలాంటి F-16ను మిగ్‌-21తోనే నేలకూల్చాం. ఏరకంగా చూసినా ‘మిగ్‌-21’ సక్సెస్‌ రేట్‌ సూపర్‌. బట్‌.. ఇదే మిగ్‌-21కి ‘ఎగిరే శవపేటిక’ అనే పేరుంది. ఎంతోమంది పైలెట్ల మరణానికి కారణమైంది. రంగ్‌ దే బసంతి మూవీకి మూలం ఈ ‘మిగ్‌-21’. 63 ఏళ్లు వీరోచిత సేవలు అందించిన మిగ్‌-21కి ఆ మరక...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి