Dog And Leopard : హమ్‌ తుమ్‌ ఏక్‌ కమరే మె బంద్‌ హో.. ఔను.. కుక్క-చిరుత ఒకే బాత్రూమ్‌లో.. ఏం జరిగిందంటే..!

|

Feb 03, 2021 | 9:15 PM

ఊర్లో నా అంతటి వాడు లేడనుకుంటుంది. తనకు తాను సింహంలా ఫీల్ అవుతుంది. అలాంటిది ఓ మూల నక్కి నక్కి కూర్చోవల్సి వచ్చింది. ఎందుకంటే.. సింహస్వప్నం లాంటి దాని ప్రత్యర్థి అదే గదిలో ఉంది. ఔను.. ఇది నిజం...

Dog And Leopard : హమ్‌ తుమ్‌ ఏక్‌ కమరే మె బంద్‌ హో.. ఔను.. కుక్క-చిరుత ఒకే బాత్రూమ్‌లో.. ఏం జరిగిందంటే..!
Follow us on

Dog And Leopard Inside Toilet : ఊర్లో నా అంతటి వాడు లేడనుకుంటుంది. తనకు తాను సింహంలా ఫీల్ అవుతుంది. అలాంటిది ఓ మూల నక్కి నక్కి కూర్చోవల్సి వచ్చింది. ఎందుకంటే.. సింహస్వప్నం లాంటి దాని ప్రత్యర్థి అదే గదిలో ఉంది. ఔను.. ఇది నిజం కుక్క-చిరుత ఒకే బాత్రూమ్‌లో దూరాయి.

అవును మీరు చదవుతున్నది నిజమే… ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ గ్రామంలో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు.. ఎలా వచ్చిందో కూడా తెలీదు. చిరుత కుక్క ఒకే గదిలో అలా ఉండిపోయాయి. ఆ రెండూ బాత్రూమ్‌లో దూరాయి. అయితే.. అంతా ఓకే.. అయితే బాత్రూమ్ డోర్‌ ఎలా క్లోజ్ అయిందో తెలీదు కానీ.. వాటికి ఎలా బయట పడాలో అర్థం కాలేదు. అంతే.. రెండూ కుక్కిన పేనులా అక్కడే రెండు పక్కపక్కనే పడున్నాయి. చెప్పుకోడానికి ఇది గ్రామ సింహం అయినా .. చిరుత ముందు గప్ చుప్.. అంతా సైలెన్స్.. ఈ రెండిటికి (బుధవారం) ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా గడిచింది.

కుక్క-చిరుత ఎంత వినయంగా బిక్కుబిక్కుమంటూ ఓ మూలన కూర్చున్నాయో తెలుసా.. ఒకరిని చూస్తే మరొకరు భయం.. భయంగా అలా ఉండిపోయాయి. అయితే ఈ ఘటనను ప్రత్యేక్షంగా చూసిన ఫారెస్ట్ అధికారు మాటల్లో… చిరుత కూడా కాస్త కంగారుగా కనిపించిందట.

బుధవారం ఉదయం నుంచి ఇదే సీన్. బాత్రూమ్‌లో కుక్క, చిరుత. బయట రెస్క్యూ టీమ్ హడావుడి. మొత్తానికి సాయంత్రం ముక్తి కలిగింది. చిరుతను బంధించింది రెస్క్యూ టీమ్. అంతసేపు బిక్కచచ్చి పోయిన కుక్క… ఊసురోమంటూ బయటకొచ్చింది. ఇలా కథ ముగిసింది.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..

Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..