Viral Video: ఇదేం రాక్షసానందమో మరీ.. కదులుతున్న కారుపై కుక్కతో విన్యాసాలు..! నెటిజన్ల ఫైర్‌..

|

Feb 04, 2023 | 12:44 PM

ఆ వీడియోలో కదులుతున్న కారుపై ఒక కుక్క భయం భయంగా కూర్చుని ఉంది. తొలుత నిల్చొని ఉన్న బ్రౌన్‌ కలర్‌ కుక్క.. ఆ తర్వాత కదులుతున్న ఆ కారుపై కూర్చుంటుంది. దాని మెడకు బెల్ట్‌ ఉండటంతో అది పెంపుడు కుక్క అని అర్థమవుతోంది.

Viral Video: ఇదేం రాక్షసానందమో మరీ.. కదులుతున్న కారుపై కుక్కతో విన్యాసాలు..! నెటిజన్ల ఫైర్‌..
Moving Car Roof
Follow us on

ప్రతిరోజూ మనం ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం..కానీ, ఇలాంటి వీడియో మాత్రం ఎవరూ చూసుండరు. కుక్క ఎప్పుడైనా కారు పైన ఎక్కి తిరుగుతున్న దృశ్యం చూశారా. చాలా మంది చూడలేదనే అంటారు. కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం కదులుతున్న కారుపై ఒక కుక్క కూర్చుని ఉంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుక్కను ప్రమాదంలో పడేసిన ఓనర్‌పై నెటిజన్లు మండిపడ్డారు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. ఫర్‌ఎవర్‌ బెంగళూరు అనే ట్విట్టర్‌ యూజర్‌ ఒక వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేశారు. ‘జస్ట్‌ బెంగళూరు థింగ్స్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు ఈ వీడియోకి.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఆ వీడియోలో కదులుతున్న కారుపై ఒక కుక్క భయం భయంగా కూర్చుని ఉంది. తొలుత నిల్చొని ఉన్న బ్రౌన్‌ కలర్‌ కుక్క.. ఆ తర్వాత కదులుతున్న ఆ కారుపై కూర్చుంటుంది. దాని మెడకు బెల్ట్‌ ఉండటంతో అది పెంపుడు కుక్క అని అర్థమవుతోంది. వైరల్ వీడియో ఇంటర్నెట్ వినియోగదారులకు కోపం తెప్పించింది. రహదారి భద్రత,జంతువుల పట్ల క్రూరత్వంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. కారు డ్రైవర్ కుక్కను ప్రమాదంలోకి నెట్టాడని ట్విట్టర్ వినియోగదారులు విమర్శించారు. దీంతో పాటు డ్రైవర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మరో కారులో ప్రయాణించిన వ్యక్తి తన ఇదంతా తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. నెటిజన్లు దీనిపై సీరియస్‌గా స్పందించారు. ఆ కుక్క, కారు యజమాని నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుక్కను ప్రమాదంలో పడేయడంపై మండిపడ్డారు. కొందరు ఈ వీడియో క్లిప్‌ను బెంగళూరు పోలీసులకు ట్యాగ్‌ చేశారు. ఆ కారు యజమానిని గుర్తించి అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైరల్ వీడియో ఇప్పటివరకు 159,2000 కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. ఇది కాకుండా, పోస్ట్ 1,030 కంటే ఎక్కువగా రీట్వీట్ చేయబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..