భారత్‌లో ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ అందరి డీఎన్‌ఏ ఒక్కటేః ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌. కలిసి ఉండటమన్నది పురోగతి, కలిసి పనిచేయడమన్నది విజయమని RSS అధినేత మోహన్ భగవత్‌ అన్నారు. దీన్నే సంఘటన్‌ అంటారని, యావత్‌ సమాజాన్ని సంఘటనగా మార్చడం తమ బాధ్యతని అన్నారు. RSS శతవసంతాల కార్యక్రమాన్ని ఆయన ఢిల్లీలో ప్రారంభించారు.

భారత్‌లో ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ అందరి డీఎన్‌ఏ ఒక్కటేః ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Rss Chief Mohan Bhagwat In Rss Centenary

Updated on: Aug 26, 2025 | 10:12 PM

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌. కలిసి ఉండటమన్నది పురోగతి, కలిసి పనిచేయడమన్నది విజయమని RSS అధినేత మోహన్ భగవత్‌ అన్నారు. దీన్నే సంఘటన్‌ అంటారని, యావత్‌ సమాజాన్ని సంఘటనగా మార్చడం తమ బాధ్యతని అన్నారు. RSS శతవసంతాల కార్యక్రమాన్ని ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ విజ్ఞానభవన్‌లో మూడు రోజుల పాటు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌కు మోహన్‌ భగవత్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

వందేభారత్‌ గీతాన్ని ఆలపించడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. భారత్‌లో ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికి అందరి డీఎన్‌ఏ ఒక్కటే అన్నారు. హిందూ దేశ సిద్దాంతాన్ని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర అంటే పాశ్చాత్య దేశాల్లో నేషన్‌ అని అర్ధం ఉందన్నారు. అంటే హిందూ రాష్ట్ర అనేది ఎప్పటినుంచో ఉందన్నారు. హిందూ రాష్ట్ర అంటే అందరికి సమ న్యాయం చేయడమే అన్నారు. హిందూ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయన్నారు. ఆఖండ్‌ భారత్‌ లక్ష్యంగా మనం పనిచేస్తున్నామన్నారు.

హైందవి, భారతీయ, సనాతన్‌ పదాల అర్ధం ఒక్కటే అని కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్‌ భగవత్‌. ఇది భౌగోళిక అంశం మాత్రమే కాదని, గత 40 వేల ఏళ్ల నుంచి మనందరిది ఒక్కటే డీఎన్‌ఏ అని అన్నారు. 1925 కంటే ముందు హిందువులను ఏకం చేయడానికి అనేక మంది కృషి చేశారని అన్నారు. హెడ్గేవార్‌, సావర్కర్‌ స్ఫూర్తితో ముందుకు వెళ్తునట్టు చెప్పారు. జాతిని ఐక్యం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి కొనసాగుతుందన్నారు. భారతీయులంతా ఒక్కటే అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యపోరాటం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ స్ఫూర్తిని పొందిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..