తమిళనాడుపై నాగ్‌పూర్‌ పెత్తనం చెల్లదు… నూతన విద్యా విధానాన్ని మరోసారి వ్యతిరేకించిన స్టాలిన్‌

నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్దాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. నాగ్‌పూర్‌ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్‌ఎస్‌స్‌ కుట్ర చేసిందన్నారు. పార్లమెంట్‌లో త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని

తమిళనాడుపై  నాగ్‌పూర్‌ పెత్తనం చెల్లదు...  నూతన విద్యా విధానాన్ని మరోసారి వ్యతిరేకించిన స్టాలిన్‌
Mk Stalin

Updated on: Mar 11, 2025 | 2:40 PM

నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్దాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. నాగ్‌పూర్‌ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్‌ఎస్‌స్‌ కుట్ర చేసిందన్నారు.

పార్లమెంట్‌లో త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్‌ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, చేసిన వ్యాఖ్యలను స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు.

మరోవైపు త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమిళనాడును అవమానించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లదుస్తులు ధరించి డీఎంకే ఎంపీలు ఆందోళన చేశారు. అయితే డీఎంకే ఎంపీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. డీఎంకేలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని, అందుకే ఈవిషయం నుంచి దృష్టి మరల్చడానికి త్రిభాషా వ్యతిరేక ఉద్యమానికి తెరపైకి తెచ్చారని విమర్శించారు. కొత్త విద్యా విధానంపై డీఎంకే మాట మార్చిందని , ఆ పార్టీ ఎంపీలు అనాగరికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపారు . తాము ముమ్మాటికి త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకమన్నారు ఎంపీ కనిమొళి.