Rice Price: పండగపూట గుడ్‌న్యూస్.. దేశ వ్యాప్తంగా తగ్గనున్న బియ్యం ధరలు

దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఓపెన్ మార్కెట్‌లో బియ్యం విక్రయాల లక్ష్యాన్ని 25 నంచి 50 లక్షల టన్నులకు పెంచుతూ నిర్ణయిం తీసుకుంది.

Rice Price: పండగపూట గుడ్‌న్యూస్.. దేశ వ్యాప్తంగా తగ్గనున్న బియ్యం ధరలు
Indias Rice Price Control

Edited By:

Updated on: Nov 07, 2026 | 11:43 AM

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం విక్రయాల లక్ష్యాన్ని 25 లక్షల టన్నుల నుంచి 50 లక్షల టన్నులకు రెట్టింపు చేసింది. అక్టోబర్ 31 నాటికి ఈ-వేలం ద్వారా ఇప్పటికే 25 లక్షల టన్నుల బియ్యం విక్రయాలు పూర్తయ్యాయి. బియ్యం, ధాన్యం నిల్వలు కలిగిన వ్యాపారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, మిల్లర్లు తమ స్టాక్ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రతి శుక్రవారం ప్రభుత్వ పోర్టల్‌లో నిల్వల వివరాలను అప్‌డేట్ చేయాలని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై అత్యవసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలో భారత్ రైస్ సరఫరా పెంచేందుకు నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ కేంద్ర గిడ్డంగులకు అదనపు బియ్యం కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 2027 జనవరి 31 వరకు బియ్యం నిల్వలపై పరిమితులు విధించేందుకు అనుమతి ఇచ్చారు.

బియ్యం నిల్వలు పెంచడం, అక్రమ నిల్వలను అరికట్టడం, మార్కెట్‌లో ధరలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. బియ్యం లభ్యత పెంచి వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us