
తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు, పొలిటికల్ పవర్‌కు మధ్య విడదీయలేని బంధం ఉంది. వెండితెరపై స్టార్‌డమ్ సంపాదించి.. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి.. ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించిన చరిత్ర తమిళనాడుది. ఇప్పుడు విజయ్ ప్రస్థానం ఆ చరిత్రకు మరో అధ్యాయాన్ని జోడించింది. సినిమా కెరీర్‌ను పక్కనపెట్టి.. రాజకీయాలే టార్గెట్‌గా మార్చుకున్న విజయ్, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. ఇప్పుడు మరో సినీ స్టార్ ధనుష్ చుట్టూ రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’గా మార్చడం.. కోయంబత్తూరులో వేలాది మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం.. త్వరలోనే ధనుష్ రాజకీయ ఆరంగేట్రం ఉంటుందన్న ప్రచారం ఊహందుకుంది.
ధనుష్ అభిమాన సంఘం ఇప్పుడు ‘ధనుష్ నర్పణి ఇయక్కం. అంటే ధనుష్ సంక్షేమ ఉద్యమమని అర్థం. కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశానికి సుమారు 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. క్రమశిక్షణ.. సామాజిక సేవ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. మాజీ జర్నలిస్ట్, మాజీ అన్నాడీఎంకే ఎంపీ రబీ బెర్నార్డ్ కూడా సమావేశంలో ప్రసంగించారు. అయితే ఈ సమావేశానికి ధనుష్ హాజరుకాలేదు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించనూ లేదు. అయినా అభిమాన సంఘాల హడావుడి మాత్రం మొదలైంది.
మరోవైపు ధనుష్ రీ ఎంట్రీపై టీవీకే సంచలన వ్యాఖ్యలు చేసింది. ధనుష్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని, కానీ తమ అధినేత విజయ్‌లా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సీఎం కావడం అసాధ్యమంటోంది. టీవీకే ఎంతోమందికి స్పూర్తినిచ్చిందని, అయితే విజయ్ రాజకీయ సక్సెస్ వన్‌డేలో రాలేదని చెప్పుకొచ్చింది. నిజానికి విజయ్ రాజకీయ ప్రస్థానం వెనుక అభిమాన సంఘాల పాత్ర కీలకం. ఒకప్పుడు అభిమాన సంఘాలుగా ఉన్న నెట్‌వర్క్‌ను.. క్రమంగా సేవా కార్యక్రమాల వేదికగా మార్చారు. ఉచితంగా ఆహారం పంపిణీ చేయడం.. లైబ్రరీలు ఏర్పాటు చేయడం..వంటి కార్యక్రమాలతో ప్రజలకు విజయ్ బాగా దగ్గరయ్యారు.ఇప్పుడు ధనుష్ అభిమాన సంఘం కూడా సంక్షేమ కార్యకలాపాలపై దృష్టి పెట్టడంతో.. విజయ్ మోడల్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వోతున్నారా అన్న చర్చ మదలైంది. అయితే ఇదంత ఈజీ వే కాదంటోంది టీవీకే. రాజకీయ పార్టీని నడపడం.. ఎన్నికల్లో విజయం సాధించడం అనుకున్నంత సులువు కాదంటూ ధనుష్ రాజకీయ ఎంట్రీపై ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటిస్తోంది టీవీకే.
మొత్తానికి విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించిన తర్వాత.. తమిళనాట సినీ తారల పొలిటికల్ ఫ్యూచర్‌పై రోజుకో న్యూస్ బయటకు వస్తోంది.
ప్రస్తుతానికి ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానుల హడావుడి తప్ప దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అధికారికంగా ధనుష్ ఎక్కడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పలేదు. మరి కేవలం ఊహాగానాలకే టీవీకే నుంచి ఆరేంజ్ రియాక్షన్ వచ్చిదంటే, రియల్‌గానే రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చ తిమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది.