DGCA: లింగ సమానత్వం దిశగా మరో ముందుడుగు పడింది. ఇప్పటికే అనేక రంగాల్లో ట్రాన్స్ జెండర్లు అవకాశాలు కల్పిస్తున్న వేళ.. డీజీసీఏ సంచలన నిర్ణయంతో తొలిసారిగా.. భారత్ లో ట్రాన్స్ జెండర్లు విమానాలు నడిపేందుకు అవకాశం దక్కనుంది. ఈమేరకు దేశంలో ట్రాన్స్ జెండర్లకు విమానాలు నడిపేందుకు అనుమతులివ్వడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA మార్గదర్శకాలు జారీచేసింది. ప్రయివేటు ఫైలట్, స్టూడెంట్ ఫైలట్, కమర్షియల్ ఫైలట్ లైసెన్స్ లకు తాము జారీచేసిన వైద్య మార్గదర్శకాలను అనుసరించి దరఖాస్తు చేసుకోవాలని DGCA తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటు.. మరికొన్ని సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. కేరళకు చెందిన ఆడమ్ హ్యారీ ప్రయత్నాల కారణంగా DGCA తన విధానంలో మార్పులు చేసింది. హార్మన్ థేరపీని పూర్తిచేసిన లేదా ఐదేళ్ల క్రితం థెరపీ ప్రారంభించిన లింగమార్పిడి అభ్యర్థులు మెంటల్ ఎబిలిటి హెల్త్ పరీక్షలు చేయించుకుటే విమానాలు నడపవచ్చని పేర్కొంది. తాము సూచించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని పరీక్షలను పూర్తిచేసి.. ఫిట్ గా ఉన్నట్లు తేలితే వారు విమానాలు నడిపేందుకు అనుమతిస్తామని DGCA స్పష్టం చేసింది. అన్ని రకాల విమనాలు నడిపేందుకు ఈ వైద్య మార్గదర్శకాలు వర్తిస్తాయని చెప్పింది.
ఫలించిన ఆడమ్ హారీ పోరాటం: ట్రాన్స్ జెండర్ గా ఉంటే ఫైలట్ ఉద్యోగి కాకుడాదా.. బ్రిటన్, అమెరికాల్లో ఫైలట్ గా పనిచేసేందుకు అనుమతి ఉండగా.. ఇక్కడెందుకు లేదంటూ DGCAను ప్రశ్నించింది. ఆడమ్ హ్మారీ భారతీయ మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ట్రెయినీ ఫైలట్.. అయితే ట్రాన్స్ ఫోబియా బాధితుడయ్యాడు. ట్రాన్స్ జెండర్ పురుషుడిగా గుర్తింపు పొందిన హ్యారీకి 2019లో కేరళ ప్రభుత్వం మద్దతు తెలిపి కమర్షియల్ ఫైలట్ శిక్షణకు పంపింది. 2020లో అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్నా విమానాలు నడిపేందుకు DGCA అనుమతించలేదు. దీంతో ఈఏడాది జులైలో తనకు న్యాయం చేయాలని కోరుతూ.. హ్యారీ కేరళ హైకోర్టులో DGCAపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. చివరికి హ్యారీ పోరాటం ఫలించింది. తాము జారీ చేసిన వైద్య మార్గదర్శకాలను ఫాలో అయి అన్ని పరీక్షలను పూర్తిచేస్తే విమానాలు నడిపేందుకు అనుమతులిస్తామని ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..