Haridwar: మరో రైలు ప్రమాద కుట్ర భగ్నం.. రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్‌ ఉంచిన వ్యక్తి అరెస్ట్..

|

Oct 30, 2024 | 7:41 AM

దేశంలో ప్రధాన రహదారుల్లోని రైళ్ళను ప్రమాదాలు జరిగేలా చేస్తుడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హరిద్వార్‌లో రైలును పేల్చివేయడానికి కుట్ర జరిగింది. హరిద్వార్-డెహ్రాడూన్ రైల్వే ట్రాక్‌పై దొరికిన డిటోనేటర్ భయాందోళనలను సృష్టిస్తుంది. ఇక్కడ రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం సకాలంలో సమాచారం అందడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం దేశ భద్రతా సంస్థలు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాయి.

Haridwar: మరో రైలు ప్రమాద కుట్ర భగ్నం.. రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్‌ ఉంచిన వ్యక్తి అరెస్ట్..
Man Arrested
Follow us on

ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక నగరం హరిద్వార్‌లో అరాచకవాదులు పెద్ద కుట్రకు ప్రయత్నించారు. రైలును పేల్చివేయడానికి ఈ కుట్ర జరిగింది. ఈ కుట్రలో భాగంగా అరాచకవాదులు హరిద్వార్-డెహ్రాడూన్ రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్‌ను కూడా అమర్చారు. ఈ విషయం సకాలంలో రైల్వే భద్రతా సిబ్బంది దృష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సంస్థలు ఆ డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయం హరిద్వార్‌లోని మోతీచూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానిక భద్రతా సంస్థలతో పాటు కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.

ఈ ఏజెన్సీలు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ యువకుడిని రైల్వే ట్రాక్ దగ్గర గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఈ డిటోనేటర్‌ను ఆ యువకుడు అమర్చాడని అనుమానిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్‌ ఉందన్న సమాచారం అందిన వెంటనే భయాందోళనలు నెలకొన్నాయి. హడావుడిగా స్థానిక పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంతలో ఒక యువకుడు రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో సంచరించడం సిసిటివి కెమెరాలో కనిపించింది. అటువంటి పరిస్థితిలో పోలీసులు వెంటనే యువకుడిని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు.

అనుమానిత నిందితుడు రాంపూర్ వాసి.

ఈ యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. హరిద్వార్ GRP ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ డిటోనర్ గురించి మొరాదాబాద్ రైల్వే డివిజన్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిందని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మోతీచూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్‌ అమర్చినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న జీఆర్పీ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. జీఆర్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విషయంపై విచారణలో భాగంగా రైల్వే ట్రాక్ చుట్టూ అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.

విచారణలో నిమగ్నమైన పోలీసులు

ఈ సమయంలో రైల్వే ట్రాక్ చుట్టూ ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతూ కనిపించాడు. ఈ యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు కేంద్ర సంస్థలకు అందించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఏజెన్సీలు కూడా దర్యాప్తు ప్రారంభించాయి. ఎస్పీ జీఆర్పీ సరితా దోవల్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు కారణం ఏ సంస్థ అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..