సినిమా లెవెల్‌ సీన్‌.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సినిమా లెవెల్‌ సీన్‌.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ
Delhi Robbery

Updated on: Sep 25, 2025 | 10:56 AM

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నగరానికి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులతో ద్విచక్రవాహనంపై చాందినీ చౌక్‌ నుంచి బైరాన్‌ మందిర్‌ వెళ్లేందుకు బయల్దేరారు.

అయితే మార్గమధ్యలో వీళ్ల బైక్‌ను ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు భారత్‌ మండపం సమీపంలోకి రాగానే వారిని అడ్డకున్నారు. వాళ్ల దగ్గర ఉన్న తుపాకీని బయటకు తీసి దానికితో శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌లను బెదిరించి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను లాక్కున్నారు. తర్వాత అక్కిడి నుంచి పారిపోయారు. దొంగల చేతిలో తుపాకి ఉండడంతో అక్కడున్న ఎవరూ వాళ్లను అడ్డుకునే సాహసం చేయలేదు.

ఇక చేసేదేమి లేక బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దుండగులు ఎత్తుకెళ్లిన బ్యాగ్‌లో 500 గ్రాముల బంగారం, 35 కిలోల వెండి వరకు ఉందని వాటి విలువ రూ. కోటి మేర ఉంటుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.