ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. కేంద్రం కీలక ఆదేశాలు..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసనకు CJP పిలుపునిచ్చింది. అయితే అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఆంక్షలు, మధ్య ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత, మెట్రో స్టేషన్ల వద్ద పరిమితులు విధించారు.

ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. కేంద్రం కీలక ఆదేశాలు..
Jantar Mantar Protest

Updated on: Oct 10, 2026 | 8:07 AM

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల సెగ.. భద్రతా ఆంక్షలు.. పోలీసుల భారీ మోహరింపు.. వెరసి ఉత్కంఠ నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా ఇవాళ జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది సీజేపీ..  ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని.. ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.  అయితే, సీజేపీ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిరసనలకు విధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గత ఆందోళనల్లో 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని, క్రిమినల్‌ నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారని ఆరోపించారు.

పోలీసులు అనుమతి నిరాకరించినా నిరసన నిర్వహించి తీరుతామని సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. అరెస్టులు, నిర్బంధాలకు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లోకి తీసుకొచ్చారు. వేలాది మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో పాటు.. భారీ సంఖ్యలో పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు.. సోషల్‌ మీడియా పోస్టులపైనా నిఘా పెట్టారు. మరోవైపు ఆకతాయిలు, అరాచక శక్తుల కదలికలపై దృష్టి పెట్టాలంటూ ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల CSలకు లేఖ రాసింది కేంద్రహోంశాఖ. ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

భారీ బందోబస్తు..

ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.. దాదాపు 20వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా.. 45 ప్రాంతాల్లో మెట్రో రైళ్లను కూడా మూసివేశారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే 250 పైగా రైళ్లను రద్దు చేశారు. కన్నాట్ ప్లేస్‌ను జంతర్ మంతర్‌తో కలిపే దాదాపు 500 మీటర్ల పొడవైన సంసద్ మార్గ్‌పై.. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రదేశాలలో ఆడియో రికార్డింగ్ సామర్థ్యాలతో కూడిన 300కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us