Police High Alert: ఆందోళనలకు రెడీ అవుతున్న రైతు సంఘాలు.. అనుమతి లేదంటున్న పోలీసులు

Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ వెలుపల దాదాపు ఏడెనిమిది నెలలుగా కొనసాగుతున్న నిరసన...

Police High Alert: ఆందోళనలకు రెడీ అవుతున్న రైతు సంఘాలు.. అనుమతి లేదంటున్న పోలీసులు
Farmers Protest

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ వెలుపల దాదాపు ఏడెనిమిది నెలలుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా జులై 22న పార్లమెంట్‌ ముందు ప్రతి రోజూ 200 మంది చొప్పున దీక్షలకు కూర్చుంటామని సంయుక్త కిసాన్ మోర్చా-SKM ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.

అయితే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ దీక్షలకు అనుమతి ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. రైతుల నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్‌డే రోజున ఢిల్లీలో జరిగిన హింసను వారు గుర్తు చేశారు. రైతుల నిరసన ముసుగులో ఖలిస్తాన్‌, పాకిస్తాన్‌కు చెందిన ISI ప్రేరిత శక్తులు విధ్వంసానికి దిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దీంతో పార్లమెంట్ బయట నిరసన చేపట్టకుండా రైతు సంఘాలను ఒప్పించేందుకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్లమెంట్ దగ్గర కాకుండా మరో చోట ఆందోళనను నిర్వహించుకోవచ్చని సూచించినా వారు దిగిరావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పార్లమెంట్‌ ముందు నిరసనకు దిగుతామని BJU నేత రాకేష్‌ తికాయత్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పార్లమెంట్‌ పరిసర ప్రాంతాలతో పాటు ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో దాదాపు 30 వేల మంది పోలీసు, భద్రత ఆసిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి: American Gold Car: ఇది చూసి నేర్చుకోండి.. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో.. నెటిజన్లకు పాఠం నేర్పించిన బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్ మహీంద్ర

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..