
మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైందని, ఫరీదాబాద్ దాని కేంద్రంగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం లోతు అక్షాంశం వద్ద 5 కి.మీ దిగువన, ఉత్తరం వైపు 28.29 డిగ్రీలు, తూర్పు రేఖాంశం వైపు 72.21 డిగ్రీల వద్ద ఉందని వెల్లడించింది. భూకంపానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి