ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లింగ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. అక్రమార్కులకు కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నిందితులు సరికొత్త విధానాల్లో స్మగ్లింగ్‌లకు పాల్పడుతూ చిక్కుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీ విమానాశ్రయంలో వెలుగుచూసింది. ఓ మహిళా ప్రయాణికురాలు ఏకంగా 21 ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను దేశాలు దాటించేందుకు ప్రయత్నించి కస్టమ్స్ అధికారులకు చిక్కింది. 26.. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్లను టిష్యూ పేపర్లలో ఉంచి అక్రమంగా తరలిస్తుండగా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో మంగళవారం మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆమె హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిందని.. ఈ క్రమంలో ఆమెను ఆపి చెక్ చేయగా.. ఈ విషయం బయటపడినట్లు తెలిపారు. వ్యానిటీ బ్యాగ్ లో టిష్యూ పేపర్లలో చుట్టి ఐఫోన్లను తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు అందిన నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.
Delhi Airport Customs intercepted a lady passenger travelling from Hong Kong to Delhi carrying 26 iPhone 16 Pro Max concealed inside her vanity bag(wrapped in tissue paper). Further investigation is underway: Customs pic.twitter.com/6hZbGNWAz0
— ANI (@ANI) October 1, 2024
ఇదిలాఉంటే.. సోమవారం తెల్లవారుజామున సౌదీ డమ్మామ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక ప్రయాణీకుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్ బ్యాటరీ ప్రాంతంలో లోపల రెండు బంగారు కడ్డీలను దాచిపెట్టి.. అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 200 గ్రాముల బరువున్న రెండు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..