ఎయిర్‌ఫోర్ట్‌లో అధికారుల తనిఖీలు..ఇరాకీ ప్రయాణికుడి బ్యాగ్‌లో తళుక్కుమన్న అనుమానాస్పద వస్తువులు..?

ప్రొఫైలింగ్ ఆధారంగా, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇండిగో విమానం నంబర్ IA-443 ద్వారా బాగ్దాద్ నుండి ఢిల్లీకి చేరుకున్న ఇరాకీ ప్రయాణీకుడిని ఆపారు. ప్రయాణీకుల లగేజీని ఎక్స్-రే స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పద చిత్రాలు గుర్తించబడ్డాయని అధికారులు తెలిపారు. తరువాత, ప్రయాణీకుడిని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD) తో తనిఖీ చేసినప్పుడు,..

ఎయిర్‌ఫోర్ట్‌లో అధికారుల తనిఖీలు..ఇరాకీ ప్రయాణికుడి బ్యాగ్‌లో తళుక్కుమన్న అనుమానాస్పద వస్తువులు..?
Gold Seized

Updated on: Apr 08, 2025 | 1:54 PM

ప్రస్తుతం బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు గోల్డ్‌ స్మగ్లర్లు యద్ధేచ్చగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారుల కళ్లుగప్పి అడ్డదారుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చాలా సార్లు బంగారం పట్టుబడిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఒక ఇరాకీ పౌరుడి వద్ద నుండి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.

ప్రొఫైలింగ్ ఆధారంగా, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇండిగో విమానం నంబర్ IA-443 ద్వారా బాగ్దాద్ నుండి ఢిల్లీకి చేరుకున్న ఇరాకీ ప్రయాణీకుడిని ఆపారు. ప్రయాణీకుల లగేజీని ఎక్స్-రే స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పద చిత్రాలు గుర్తించబడ్డాయని అధికారులు తెలిపారు. తరువాత, ప్రయాణీకుడిని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD) తో తనిఖీ చేసినప్పుడు, అతని లగేజీ నుండి వివిధ రకాల పసుపు లోహపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇవి వెండితో పూత పూయబడి బంగారంలా కనిపించాయి. వాటి మొత్తం బరువు 1203.00 గ్రాములుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం స్వచ్ఛత, విలువను విరించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..