Cyclone Murasu: ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మరో ముప్పు.. ఈసారి తుఫానుకు తమిళం పేరు..!

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారుతోంది. దీనికి ‘మురసు’ (Murasu) అని పేరు పెట్టారు. నవంబర్ 2 సాయంత్రం నాటికి ఏపీ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Cyclone Murasu: ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మరో ముప్పు.. ఈసారి తుఫానుకు తమిళం పేరు..!
Cyclone Murasu

Updated on: Oct 31, 2026 | 5:06 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారుతోంది. దీనికి ‘మురసు’ (Murasu) అని పేరు పెట్టారు. నవంబర్ 2 సాయంత్రం నాటికి ఏపీ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

12 గంటల్లో మరింత బలపడే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఈ వాతావరణ వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తొలుత వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తు్న్నారు. ఆదివారం నాటికి తుఫాన్‌గా మారవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌గా మారితే దానికి ‘మురసు’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరు భారత్ సూచించింది. తమిళంలో ‘మురసు’ అంటే డప్పు లేదా పెద్ద శబ్దం చేసే వాయిద్యం అని అర్థం.

నవంబర్ 2న ఏపీ తీరానికి సమీపంలోకి..

ప్రస్తుత అంచనాల ప్రకారం నవంబర్ 2 సాయంత్రానికి ఈ తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. అయితే తుఫాన్ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై స్పష్టతను తదుపరి బులెటిన్‌లో వెల్లడిస్తామని వాతావరణ శాఖ పేర్కొంది.

మత్స్యకారులకు హెచ్చరిక.. !

సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

మరో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఇటీవల ఏపీని ప్రభావితం చేసిన ‘ఆర్నబ్’ తుఫాన్ సహాయక చర్యలు, నష్టం అంచనా, పునరుద్ధరణ పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.

పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన

మరోవైపు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. ఆర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించింది. గంగలకుర్రులో దెబ్బతిన్న వరి చేలను సందర్శించి, పంట నష్టం వివరాలను రైతులు, అధికారులను అడిగి తెలుసుకుంది.

ఒకవైపు ఆర్నబ్ తుఫాన్ నష్టాల నుంచి కోలుకునే ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ‘మురసు’ తుఫాన్ ముప్పు తెరపైకి రావడంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాబోయే రెండు రోజులు వాతావరణ పరిస్థితులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us